1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
  4. Covid 19- Release of Unlock 5.0 Guidelines on AP: Here are the guidelines

ఏపీలో అన్‌లాక్ 5.0 గైడ్ లైన్స్ విడుదల: మార్గదర్శకాలు ఇవే

Covid 19
దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకు పెరిగిపోతున్నది. దేశంలో రోజుకు 70 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నప్పటికీ ఇప్పుడిప్పుడే జీవన విధానం సాధారణ స్థితికి చేరుకుంటుంది. అక్టోబరు 15 నుంచి అమల్లోనికి రానున్న అన్ లాక్ 5 మార్గదర్శకాలను పది రోజుల క్రిందట కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.
 
ఇందులో దాదాపు అన్ని రకాల వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలకు అనుమతినిచ్చింది. అలాగే కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రానికి సంబంధించిన అన్ లాక్ 5.0 గైడ్ లైన్స్‌ను విడుదల చేసింది.గైడ్ లైన్స్ ప్రకారం రద్దీగా ఉండే ప్రదేశాలలో మాస్కులు,భౌతిక దూరం తప్పనిసరి అని పేర్కొంది. సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్, షాపుల వద్ద శానిటైజర్లను ఏర్పాటు చేసుకోవాలని తెలిపింది.
 
కోవిడ్ నిబంధనలు కచ్చితంగా ప్రజా రవాణాలో పాటించాలని తెలిపింది. అలాగే గుళ్లు, చర్చీలు, మసీదులలో కూడా కోవిడ్ నిబంధనలు పాటించాలని తెలిపింది. విద్యార్థులు, అధ్యాపకులు ప్రతి పీరియడ్ తర్వాత శానిటైజర్ చేసుకునేలా యాజమాన్యాలకు ఆదేశాలు జారీచేశాయి. విద్యాసంస్థలు, పారిశ్రామిక కార్యకలాపాలు నిర్వహించే చోట్ల కేంద్ర మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటించాలని సూచించింది.
తర్వాతి కథనం
కడపలో స్థానిక సమాజాలకు దాల్మియా సిమెంట్ ఇప్పటివరకూ రూ. 7 కోట్ల విరాళం