శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 9 అక్టోబరు 2020 (21:45 IST)

కడపలో స్థానిక సమాజాలకు దాల్మియా సిమెంట్ ఇప్పటివరకూ రూ. 7 కోట్ల విరాళం

అందరికీ అత్యుత్తమ జీవనోపాధిని అందించాలనే ప్రయత్నంలో భాగంగా దాల్మియా సిమెంట్‌(భారత్‌) లిమిటెడ్‌ పలు కార్యక్రమాలను మరియు పథకాలను ఆంధ్రప్రదేశ్‌లోని కడపలో స్థానిక సమాజాలకు మద్దతునందిస్తూ ప్రారంభించింది. ఇప్పటివరకూ, ఈ కంపెనీ దాదాపుగా 7 కోట్ల రూపాయలను తమ సీఎస్‌ఆర్‌ కార్యక్రమాలలో భాగంగా ఖర్చు చేసింది. ఈ కార్యక్రమాలలో వాటర్‌ హార్వెస్టింగ్‌ కార్యక్రమాలు, పునరుత్పాదక ఇంధన పరిష్కారాలను అందించడం, ఆరోగ్య మరియు పారిశుద్ధ్య కార్యక్రమాలు, నైపుణ్య శిక్షణ, విద్య వంటివి ఎన్నో ఉన్నాయి.
 
‘‘మీరు పనిచేసే వ్యక్తుల అవసరాలు అర్ధం చేసుకోవడం మరియు గౌరవం, నమ్మకమనే బలమైన పునాదిపై శక్తివంతమైన వ్యాపారం ఆధారపడి ఉంటుంది. కడప ప్రజలతో మా అనుబంధం సుదీర్ఘమైనది. ఆరంభం నుంచి కూడా మేము స్థానిక కమ్యూనిటీల అవసరాలను తీర్చేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాం. తద్వారా అందరికీ విస్తృతస్థాయిలో జీవనోపాధి అవకాశాలను సృష్టిస్తున్నాం.
 
మా సమగ్రమైన సంక్షేమ పథకాల ద్వారా, ఇప్పుడు మేము ఈ ప్రాంతంలోని సమస్యలను రూపు మాపేందుకు ప్రయత్నిస్తున్నాం. ఈ కమ్యూనిటీలు స్థిరంగా సంపద వైపు దూసుకుపోయేందుకు స్ధిరమైన మార్గమూ వేస్తున్నాం. మా లక్ష్యానికి అనుగుణంగా, మేము మా సీఎస్‌ఆర్‌ పథకాలలో పెట్టుబడులను పెట్టనున్నాం’’ అని శ్రీ కె.కె. రావు, ప్లాంట్‌ హెడ్‌, కడప, దాల్మియా సిమెంట్‌ (భారత్‌) లిమిటెడ్‌ అన్నారు.
 
సమాజానికి తిరిగి ఇవ్వడనే నేపథ్యానికి దాల్మియా సిమెంట్‌(భారత్‌) లిమిటెడ్‌ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంది. తాము తీసుకునే ప్రతి నిర్ణయమూ వారి యొక్క సంపూర్ణమయైన శ్రేయస్సు లక్ష్యంగా తీసుకుంటుంది. గత కొద్ది సంవత్సరాలుగా ఈ కంపెనీ ఆరోగ్య సంరక్షణ, పారిశుద్ధ్యం, విద్య, గ్రామీణాభివృద్ధి, మహిళా సాధికారిత, ఇతర సామాజిక అభివృద్ధి అంశాలను తమ సీఎస్‌ఆర్‌ కార్యక్రమాల ద్వారా పరిష్కరిస్తుంది. కడపలో సైతం, డీసీబీఎల్‌ స్థానిక కమ్యూనిటీలతో అతి సన్నిహితంగా పనిచేస్తూ వీలైనన్ని మార్గాలలోనూ వారికి మద్దతునందిస్తుంది.
 
ఓ సంస్థగా, డీసీబీఎల్‌ ఎప్పుడూ కూడా అత్యంత విలువైన వనరుగా నీరు నిలుస్తుందని భావిస్తుంది. స్వచ్ఛమైన తాగునీరు పొందడమన్నది ప్రతి ఒక్కరి కనీస ప్రాధమిక హక్కు. కడపలో నివశిస్తున్న ప్రజలకు సైతం ఇదే అందించేందుకు, ఈ కంపెనీ పలు ఆర్‌ఓ ప్లాంట్స్‌, బోర్‌ వెల్స్‌, ఓవర్‌హెడ్‌ వాటర్‌ స్టోరేజీ ట్యాంకులు మొదలైనవి నవాబ్‌ పేట, చిన్న కొమెర్ల, తాలమంచిపట్నం, దుగ్గనపల్లి గ్రామాలలో అందించింది.
 
అంతేకాదు, డీసీబీఎల్‌ ఇప్పటికే దాదాపు 20 రెయిన్‌ వాటర్‌ హార్వెస్టింగ్‌ కేంద్రాలను ఏర్పాటుచేసింది. ఇవిగాక 120కు పైగా వ్యవసాయ చెరువులు, 4 చెక్‌ డ్యామ్‌లు ఈ గ్రామాలలో ఏర్పాటు చేసింది. వీటితో పాటుగా స్వచ్ఛమైన మరియు పునరుత్పాదక విద్యుత్‌ను కంపెనీ యొక్క ప్రయత్నాలలో భాగంగా అందుబాటులోకి తీసుకువస్తూ 50కు పైగా సోలార్‌ స్ట్రీట్‌లైట్స్‌ను ఈ గ్రామాలలో ఏర్పాటు చేసింది.
 
అంతేకాదు, డీసీబీఎల్‌ విజయవంతంగా ఈ ప్రాంతంలో ఆరోగ్య, పారిశుద్ధ్య సవాళ్లను సైతం అధిగమించి 147 వ్యక్తిగత  శానిటరీ మరుగుదొడ్లను నవాబ్‌పేట, చిన్నకొమెర్ల, తాలమంచిపట్నం, దుగ్గనపల్లి గ్రామాలలో పంపిణీ చేసింది. విద్యకోసం, ఈ కంపెనీ ఈ ప్రాంతంలో మౌలిక వసతుల అభివృద్ధి కార్యక్రమాలను ఏర్పాటుచేసింది. 
 
పాఠశాలల అభివృద్ధి, క్రీడాకార్యక్రమాలకు మద్దతునందిస్తూ క్రీడా మెటీరియల్‌/సామాగ్రి అందించడం, విద్యార్థుల కోసం స్కాలర్‌షిప్‌ అవకాశాలను అందించడం అలాగే కొన్ని గ్రామాల కోసం డిజిటల్‌ అభ్యాసాలకు మద్దతునందించడం చేస్తుంది. ఈ చిన్నారులే రేపటి భావి నాయకులు అని డీసీబీఎల్‌ విశ్వసిస్తోంది. అందువల్ల తగిన విద్యను ఖచ్చితంగా దేశాభివృద్ధి కోసం అందించాల్సి ఉంది. విద్యావకాశాలతో పాటుగా ఈ కంపెనీ ఉద్యోగావకాశాలను సైతం నవాబ్‌పేట, చిన్నకొమెర్ల, దుగ్గనపల్లి, తాలమంచిపట్నం గ్రామస్తులకు తమ ప్లాంట్‌లోని ఖాళీలను అనుసరించి అందించింది.