సంబంధిత వార్తలు
- 2022కు గాను బ్రేక్ త్రూ ఇండియా పార్టిసిపంట్స్ ను ప్రకటించిన బీఏఎఫ్ టీఏ
- తగ్గుతున్న కోవిడ్ పాజిటివ్ కేసులు - పెరుగుతున్న మృతులు
- ఎయిరిండియాకు కొత్త బాస్ - రతన్ టాటా వెల్లడి
- మాజీ భారత క్రికెటర్ వసీం జాఫర్ ఫన్నీ మీమ్ పోస్ట్
- మా పరిస్థితి ఏంటి? ఇక్కడే చదువుకునేట్లు అనుమతివ్వండి: ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్థులు
12-14 ఏళ్ల పిల్లలకు నేటి నుంచి కరోనా వ్యాక్సిన్
హైదరాబాద్‌కు చెందిన బయాలాజికల్-ఈ సంస్థ తయారు చేసిన కార్బివాక్స్ టీకాను పిల్లలకు వేయనున్నామని తెలిపింది. ఈ క్రమంలో 12-14 ఏళ్ల పిల్లలకు బుధవారం నుంచి కరోనా వ్యాక్సిన్‌ను వేయనున్న నేపథ్యంలో కేంద్రం మార్గదర్శకాలను జారీ చేసింది.
పిల్లలకు కరోనా వ్యాక్సిన్ ఇస్తున్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ర్టాలకు కేంద్రం సూచించింది. ముఖ్యంగా వ్యాక్సిన్ మిక్సింగ్ లాంటివి జరుగకుండా చూసుకోవాలని కోరింది. టీకా ఇవ్వడంలో శిక్షణ పొందిన వారినే వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్‌లో నియమించాలని తెలిపింది. టీకాలు ఇచ్చేందుకు ప్రత్యేక సెషన్లు ఏర్పాటు చేయాలని సూచించింది. టీకాల వృథాను అరికట్టాలని కోరింది.
తొలి డోసు తీసుకున్న 28 రోజుల తర్వాత రెండో డోసు ఇవ్వనున్నట్టు కేంద్రం వెల్లడించింది. 2010 లేదా అంతకన్నా ముందు జన్మించినవాళ్లు టీకా తీసుకోవడానికి అర్హులని, వీరంతా వ్యాక్సిన్ కోసం కొవిన్ పోర్టల్‌లో పేరును నమోదు చేసుకోవచ్చని పేర్కొంది.
12 ఏళ్ల నిండినవాళ్లు మాత్రమే పేరును నమోదు చేసుకోవాలని, ఒకవేళ 12 ఏండ్లు నిండకపోతే పేరు నమోదు చేసుకున్నా టీకా ఇవ్వమని స్పష్టం చేసింది.
తర్వాతి కథనం
