మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 14 మార్చి 2022 (14:12 IST)

మా పరిస్థితి ఏంటి? ఇక్కడే చదువుకునేట్లు అనుమతివ్వండి: ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్థులు

రష్యా దాడులతో ఉక్రెయిన్ తీవ్రంగా దెబ్బతింటోంది. ప్రపంచ దేశాలన్నీ దాడి ఆపమని రష్యాకి చెపుతున్నప్పటికీ అది ఏమాత్రం వెనకడుకు వేయడంలేదు. దీనితో ఉక్రెయిన్ నగరాలన్నీ శ్మశాన వాతావరణాన్ని తలపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో అక్కడ చదువుకునేందుకు వెళ్లి, యుద్ధం కారణంగా స్వదేశానికి వచ్చిన 20 వేల మంది వైద్యవిద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

 
ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో... ఒకవేళ ముగిసినా అక్కడికి వెళ్లి చదువుకునే అవకాశం వుంటుందో లేదోనని ఆందోళన చెందుతున్నారు. ఈ నేపధ్యంలో తాము స్వదేశంలోనే చదువుకునే వీలును కల్పిస్తూ ప్రభుత్వాలకు ఆదేశాలివ్వాలంటూ విద్యార్థులు ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు.

 
విద్యార్థుల పిటీషన్ పైన మార్చి 21న విచారణ జరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. యుద్ధం కారణంగా విద్యార్థుల చదువులు, భవిష్యత్తు అగమ్యగోచరంగా మారకుండా చూడాలని వారి తల్లిదండ్రులు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు.