1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
  4. Media Bulletin on Covid Positve Cases in Andhra Pradesh, India

ఏపీలో కొత్తగా కరోనా పాజిటివ్ కేసులెన్ని?

Covid Positive Cases
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నమోదయ్యే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 606 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం 11,980 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 606 మందికి ఈ వైరస్ సోకినట్టు తేలింది. ఇందులో ఒక్క అనంతపురం జిల్లాలోనే అత్యధికంగా 22 కేసులు నమోదయ్యాయి. శ్రీకాకుళం, విజయనగరం, నెల్లూరు, కర్నూలు, కడప జిల్లాల్లో ఒక్క కేసు కూడా రిజిస్టర్ కాలేదు. 
 
అలాగే, మరో 84 మంది ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. గడిచిన ఒక్క రోజులో ఒక్కటంటే ఒక్క మరణం కూడా నమోదు కాలేదు. తాజాగా కేసులతో కలుపుకుంటే రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 23,18,858 ఉండగా, ఇందులో 23,03,522 మంది ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. అలాగే, ఇప్పటివరకు 14730 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
ఇదిలావుంటే, దేశంలో మొత్తం 3116 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే, 5559మంది కోలుకున్నారు. ప్రస్తుతం కరోనా పాజిటివిటీ రేటు 0.41 శాతంగా ఉంది. ఇపుడు దేశంలో 38,069 మంది కరోనాకు చికిత్స తీసుకుంటున్నారు. ఈ వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,24,37,072గా ఉంది. 
తర్వాతి కథనం
సౌదీ అరేబియాలో సంచలనం : ఒకే రోజు 81 మంది ఉరితీత