1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
  4. Nasal Covid-19 vaccine: Animal study shows effective immunity, zero virus spread

ముక్కు ద్వారా వేసే కరోనా టీకా.. సింగిల్ డోసు ఇస్తే..?

Nasal Covid-19 vaccine
ముక్కు ద్వారా వేసే కరోనా టీకా వస్తోంది. ఈ నాజల్ కొవిడ్ వ్యాక్సిన్ జంతువుల్లో సమర్థవంతంగా పనిచేస్తుందని రీసెర్చ్‌లో తేలింది. SARS-CoV-2 virus వ్యాప్తి చేసే వైరస్ నియంత్రణకు నాజల్ కొవిడ్ వ్యాక్సిన్ (intranasal COVID-19 vaccine) ఒక సింగిల్ డోసు ఇస్తే చాలంటున్నారు పరిశోధకులు. 
 
అమెరికాలోని జార్జియా యూనివర్శిటీ సైంటిస్టులు ఈ అధ్యయనాన్ని నిర్వహించగా.. జనరల్ స్సైన్స్ అడ్వాన్సెస్‌లో ప్రచురించారు. ఇన్ ఫ్లూయింజా వంటి టీకాల మాదిరిగానే ఈ టీకా కూడా నాజల్ స్ప్రే ద్వారా తీసుకోవచ్చునని పేర్కొన్నారు. అంతేకాదు.. ఈ సింగిల్ డోస్ నాజల్ వ్యాక్సిన్ సాధారణ రిఫ్రిజేటర్ ఉష్ణోగ్రతలో కనీసం మూడు నెలల పాటు స్టోర్ చేసుకోవచ్చు.
 
ప్రస్తుత కరోనా టీకాలు బాగా పనిచేస్తున్నాయని, ప్రపంచ జనాభాలో అధికశాతం మంది ఇంకా వ్యాక్సిన్‌ అందుకోలేదని అభిప్రాయపడుతున్నారు. ప్రపంచ జనాభాకు కరోనా టీకాల అవసరం ఎంతైనా ఉందన్నారు. టీకా వేసేటప్పుడు ఎలాంటి నొప్పిలేకుండా సులభంగా ఉండేలా ఈ నాజల్ స్ప్రే వ్యాక్సిన్ తీసుకురావాలని భావిస్తున్నారు. అంతేకాదు.. కరోనా వ్యాప్తిని కూడా సమర్థంగా నిరోధించేదిగా ఉండాలని పరిశోధన శాస్త్రవేత్త పాల్‌ మెక్‌ క్రే వెల్లడించారు.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
కొత్త రాజ‌ధాని విశాఖ‌కు నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యం