శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 10 జూన్ 2021 (23:15 IST)

ఆ జీవి వందలు కాదు 24 వేల సంవత్సరాలు బతికే వుంటుంది...!

Wheel Animals
ఆ జీవి వందలు కాదు వేల సంవత్సరాలు బతికి వుందంటే నమ్ముతారా? నమ్మితీరాల్సిందే. తాజాగా ఓ జీవి మాత్రం గత 24 వేల ఏళ్లనుంచి జీవించే ఉన్నట్లుగా గుర్తించారు పరిశోధకులు. బీరియాలో రోటిఫెర్‌ అనే ఒక మైక్రోస్కోపిక్‌ ఓ వింత జీవిని గుర్తించారు పరిశోధకులు. దీన్ని 'వీల్‌ యానిమాల్‌క్యూల్‌' అని కూడా అంటారట.

అసలు ఇది అన్నేళ్లపాటు ఎలా జీవించి ఉంది అనే అంశంపై రష్యాలోని సోయిల్‌ సైన్స్‌కు చెందిన శాస్త్రవేత్తలు పరిశోధన చేసి ఓ డాక్యుమెంట్‌ రిలీజ్‌ చేశారు.
 
క్రిప్టోబేసిస్‌ అనే విధానం ద్వారా ఈ మల్టీ సెల్యులర్‌ యానిమిల్స్‌ వేల సంవత్సరాలు బతకగలుగుతున్నాయని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. మెటబాలిజంను పూర్తిగా ఆపేయడం వల్ల ఇలా వేల ఏళ్ల తరబడి ఆ జీవి ప్రాణంతో ఉండి ఉంటుందని చెబుతున్నారు. ఈ జీవికి ఉండే చిన్నపాటి జుట్టు చక్రంలా తిరిగి ఉంటుంది. అందుకే దానికి వీల్‌ అనే అర్థం వచ్చేలా 'వీల్‌ యానిమాల్‌క్యూల్స్‌' అంటారని తెలిపారు. 
 
ఇది ప్రపంచంలోనే అత్యంత నిరోధక జంతువు అని.. ఇది విపత్కర పరిస్థితులను కూడా ఎదుర్కోగలదని తెలిపారు. ఎంత ఆకలిగా ఉన్నా.. తీవ్రమైన ఆమ్ల వాతావరణమైనా.. ఆక్సిజన్ లేకపోయినా నిర్జలీకరణ పరిస్థితుల్లో కూడా జీవించగలదని తెలిపారు.
 
రష్యాకు చెందిన శాస్త్రవేత్తల బృందం ఈశాన్య సైబీరియాలో సరికొత్త డ్రిల్లింగ్‌ టెక్నిక్స్‌తో శాంపిల్స్‌ను సేకరించారు. అలా 11 అడుగులకు కింద సేకరించిన శాంపిల్స్‌లో ఈ రోటిఫెర్స్‌ కనిపించిందట. ఏదో వింతగా కనిపిస్తోందని అనుమానించిన శాస్త్రవేత్తలు దానిని రేడియో కార్బన్‌ డేటింగ్‌ విధానంతో పరిశీలించారు. 
 
అలా పరిశీలించాక ఆ రోటిఫెర్స్‌ 24 వేళ్ల ఏళ్లు గడిచినా ఇంకా బతికి ఉందని గుర్తించిన శాస్త్రవేత్తలు కూడా షాక్ అయ్యారు. ఈ విషయాన్నే వాళ్లు డాక్యుమెంట్‌లో వెల్లడించారు. ఇలా మంచులో ఏళ్ల తరబడి ఉన్నా ప్రాణాలు నిలుపుకునే జంతువులు కొన్ని ఉన్నాయి.