1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
  4. Ranjit Sinha, Former CBI Chief, Dies At 68. He Was Covid Positive

కరోనా సోకి సీబీఐ మాజీ చీఫ్ రంజిన్ సిన్హా మృతి

Ranjit Sinha
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) మాజీ చీఫ్ రంజిత్ సిన్హా శుక్రవారం ఉదయం కన్నుమూశారు. కరోనా బారినపడి ఆయన మృతి చెందినట్లు తెలుస్తోంది. ఆయన వయస్సు 68 ఏళ్లు. వేకువజామున 4.30 గం.లకు ఢిల్లీలో ఆయన తుదిశ్వాస విడిచారు. 
 
రంజిత్ సిన్హా 1974 బ్యాచ్‌కు చెందిన రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్. డిసెంబరు 2012 నుంచి 2014 వరకు రెండేళ్ల పాటు ఆయన సీబీఐ డైరెక్టర్‌గా పనిచేశారు. సీబీఐ డైరెక్టర్‌ పదవితో పాటు ఇండో టిబెటిన్ బార్డర్ పోలీస్(ITBP) డైరెక్టర్ జనరల్ (DG), రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(RPF) చీఫ్ తదితర పలు కీలక హోదాల్లో ఆయన సేవలందించారు. రంజిత్ సిన్హా మరణానికి సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.
About Writer
ఎం
తర్వాతి కథనం
డాక్టర్ కాకర్ల మృతిపై ఉపరాష్ట్రపతి సంతాపం