సంబంధిత వార్తలు
- తెలంగాణా పోలీస్ శాఖను వణికిస్తున్న కరోనా.. 10 శాతం మందికి వైరస్
- ఆఫర్ల్ కోసం టెంప్ట్ అయితే ఇరుక్కోక తప్పదు: ఎపీ డిజిపి గౌతం సవాంగ్ వార్నింగ్
- ప్రియుడితో ముద్దు పెట్టించుకున్న వధువు.. ఠాణాలో వదిలేసివెళ్లిన భర్త
- కోవిడ్ కేర్ కేంద్రంలో లేడీ కానిస్టేబుల్‌పై ఖాకీ అత్యాచారం.. ఎక్కడ?
- సుశాంత్ కేసు : సీబీఐ సమన్లతో ముంబై పోలీసుల వెన్నులో వణుకు
యముడికి లేఖ రాసిన తమిళ పోలీసులు.. అలాంటి మరణమే కావాలని..?
చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు చుక్కలు చూపిస్తోంది. కరోనా కారణంగా గత కొద్ది రోజులుగా 60వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ మహమ్మారిపై పోరులో ప్రజలను రక్షించేందుకు అహర్నిశలు కృషి చేస్తున్న వారిలో డాక్టర్లు, పోలీసులు ముందు ఉన్నారు.
విధి నిర్వహణలో పోలీసులు కరోనాకు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో తమిళనాడు పోలీసులు వినూత్న ఆలోచన చేశారు. తమను జీవితకాలాన్ని కాపాడాలని ఏకంగా యముడికి లేఖ రాసారు. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
'మేము ఎన్ని కష్టాలు అనుభవించినా.. ప్రజల ప్రాణాలు కాపాడటమే మా అంతిమ లక్ష్యం. కాబట్టి మా జీవిత కాలాన్ని దయాగుణంతో పొడిగించాలని మిమ్మల్ని కోరుతున్నాం. ఈ దేశానికి ఉపయోగపడే మరణం మాకు ఉందని భరోసా ఇవ్వండి. అలాంటి మరణమే మాకు కావాలి. ఈ లేఖ తరువాత పోలీసుల మరణాలపై దయ చూపిస్తారని నమ్ముతున్నాం. ' అని లేఖలో పేర్కొన్నారు. ఇప్పుడు ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తర్వాతి కథనం
