ధోనిని గుర్తు చేసిన యాస్తికా.. రెప్పపాటులో షాక్ (Video)
Yastika Bhatia
యాస్తికా భాటియా చేసిన అద్భుతం ధోనీని మరోసారి గుర్తు చేసింది. భాటియాకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోమవారం శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో భాటియా వికెట్ కీపింగ్‌తో ఆకట్టుకుంది. తన వేగంతో అనుష్క సంజీవనిని పెవిలియన్‌కు పంపింది.
రెప్పపాటులో బ్యాట్స్‌మెన్‌కు షాక్ ఇచ్చింది. భాటియా ఏం చేసిందో, భారత ఆటగాళ్లతో పాటు శ్రీలంక ప్లేయర్లు కూడా అర్థం చేసుకోలేకపోయారు. రీప్లే చూసిన థర్డ్ అంపైర్ అనుష్క రనౌట్ అయినట్లు ప్రకటించడంతో అంతా అవాక్కయ్యారు. 25 పరుగుల వద్ద అనుష్క రనౌట్ అయింది. యాస్తికా భాటియా వీడియోను మీరూ ఓ లుక్కేయండి.
Brilliant glove work by Yastika Bhatia in the second ODI. pic.twitter.com/FKLoT23q63
— Johns. (@CricCrazyJohns) July 4, 2022
