శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 4 జులై 2022 (19:27 IST)

వలస కార్మికుల పరిష్కారం కోసం ఒన్‌ పాయింట్‌ ఒన్‌ లేబర్‌ హెల్త్‌ డెస్క్‌

Migrant workers
బిజినెస్‌ ప్రాసెస్‌ మేనేజ్‌మెంట్‌ (బీపీఎం)లో సుప్రసిద్ధ సంస్ధ ఒన్‌ పాయింట్‌ ఒన్‌ సొల్యూషన్స్‌ ఇప్పుడు వలస కార్మికుల సంక్షేమానికి లేబర్‌ హెల్ప్‌ డెస్క్‌ ఓ పరిష్కారంగా చూస్తోంది. ఈ లేబర్‌ హెల్ప్‌ డెస్క్‌, సుప్రీంకోర్టు తీర్పుకు ప్రత్యక్ష స్పందన.


ఆ తీర్పులో రాష్ట్ర ప్రభుత్వాలను, వలస కార్మికులను కలుసుకోవడంతో పాటుగా మహమ్మారి అనంతర సంక్షోభంలో వారు తమ సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు సహాయపడడంతో పాటుగా సంపూర్ణ సహకారం, మార్గనిర్దేశకత్వం అందించాలని ఆదేశించింది. కోవిడ్‌-19 మహమ్మారి సమయంలో వలసకార్మికుల సమస్యలు మరియు కష్టాల ను చూసి సుప్రీంకోర్టు తన సుమోటు పిటీషన్‌కనుగుణంగా ఈ తీర్పును వెలువరించింది.
 
ఔట్‌బౌండ్‌ సేవలు (వాయిస్‌ మరియు నాన్‌ వాయిస్‌), ఇన్‌బౌండ్‌ సేవలు, ఎస్‌ఎంఎస్‌, వాట్సాప్‌, ఐవీఆర్‌ సెల్ఫ్‌ సర్వీస్‌ వంటి సేవలను అందించే కాల్‌ సెంటర్‌ భాగస్వామిని గుర్తించడం, నియమించడం కోసం తమ లాంటి బాహ్య ఏజెన్సీల ఆవశ్యకతను సుప్రీంకోర్టు తీర్పు తప్పని సరి చేసింది. ఔట్‌బౌండ్‌ కాలింగ్‌ కింద కాల్స్‌ను వలసకార్మికులకు చేయడంతో పాటుగా అందుబాటులోని పలు పథకాలను గురించి వారికి వెల్లడించడం, పథకాలకు సంబంధించి ఇన్‌బౌండ్‌ కాల్స్‌కు సమాధానాలు చెప్పడం చేయాల్సి ఉంటుంది.
 
ఎస్‌ఎంఎస్‌బ్రాడ్‌కాస్ట్స్‌ కింద బల్క్‌ మెసేజింగ్‌ను  పంపడంతో పాటుగా హెల్ప్‌ డెస్క్‌ నెంబర్‌ (1800) గురించి వలస కార్మికులకు సమాచారం అందించడం, ఐవీఆర్‌ సెల్ఫ్‌సర్వీస్‌, కస్టమైజబల్‌ పరిష్కారాలను అందించడం ద్వారా వలస కార్మికులకు పథకాలకు సంబంధించిన సమాచారం అందించడం చేస్తారు. ఒన్‌ పాయింట్‌ ఒన్‌ సొల్యూషన్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అక్షయ్‌ చాబ్రా మాట్లాడుతూ, ‘‘సుప్రీంకోర్టు తీర్చు వలస కార్మికుల హక్కులను మరీ ముఖ్యంగా కోవిడ్‌ 19 సమయంలో తీవ్రంగా ఇబ్బందులు పడిన కార్మికుల హక్కులను కాపాడింది.
 
వారి సంక్షేమం, పరిశ్రమ కార్యకలాపాలు మెరుగ్గా సాగేందుకు ఇది ఓ ముందడుగుగా నిలిచింది. ఈ హెల్ప్‌ డెస్క్‌ వల్ల వలస కార్మికులందరూ నమోదు చేసుకోవడం సాధ్యమవుతుంది. తద్వారా సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేయడం సాధ్యమవుతుంది. అర్హత కలిగిన వ్యక్తులు  ఈ పథకాలతో ప్రయోజనం పొందగలరు’’ అని అన్నారు.