1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
  4. R Ashwin Urges CSK To Consider Releasing MS Dhoni, But On One Condition

చెన్నై సూపర్ కింగ్స్ నుంచి ధోనీని తప్పించాలి : ఆర్.అశ్విన్

MS Dhoni
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నుంచి మాజీ కెప్టెన్ ధోనీని తప్పించాలని మాజీ స్పిన్నర్ ఆర్. అశ్విన్ అభిప్రాయపడ్డారు. మంగళవారం ఐపీఎల్ 2027 సీజన్‌కు సంబంధించి రీటెన్షన్ ఆటగాళ్ళ జాబితా వెలువడనుంది. దీంతో సీఎస్కే మాజీ కెప్టెన్ ధోనీ భవితవ్యంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో అతడి మాజీ సహచరుడు రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. 
 
ధోనీని సీఎస్కే జట్టు నుంచి రిలీజ్ చేసి కోచ్‌ లేదా మెంటార్‌గా నియమించుకోవాలన్నాడు. అలా చేస్తే రాబోయే వేలంలో జట్టుకు రూ.4 కోట్లు కలిసొస్తాయని పేర్కొన్నాడు. అలాగే ప్రశాంత్ వీర్ (రూ.14.20 కోట్లు), కార్తిక్ శర్మ (రూ.14.20 కోట్లు)లను రిలీజ్‌ చేయాలని సీఎస్కేకు అశ్విన్ సూచించాడు. గాయాల కారణంగా 2026 సీజన్‌లో ధోనీ ఒక్క మ్యాచ్‌ కూడా ఆడని విషయం తెల్సిందే. 
 
'రాహుల్ చాహర్, ప్రశాంత్ వీర్‌లను చెన్నై వేలంలోకి వదిలేస్తుందని భావిస్తున్నా. ధోనీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. అతడు నాన్-ప్లేయింగ్ రోల్ తీసుకోవచ్చు. అదే జరిగితే జట్టుకు మరో రూ.4 కోట్లు లభిస్తాయి. అవి వేలంలో చెన్నైకి ఉపయోగపడతాయి. మాథ్యూ షార్ట్‌, కార్తిక్ శర్మలతో పెద్దగా ఒరిగిందేమీ లేదని భావించి రిలీజ్ చేస్తే.. సీఎస్కే రూ.40-45 కోట్లతో వేలానికి వెళ్లొచ్చు. నాలుగో స్థానంలో కార్తిక్‌ శర్మ మంచి ప్రదర్శనే చేశాడు. శివమ్ దూబె, డెవాల్డ్ బ్రెవిస్ కూడా అదే స్థానంలో ఆడగలరు. ఒకవేళ మీకు కార్తిక్‌ కావాలనుకుంటే.. అతడిని రిలీజ్‌ చేసి వేలంలో తక్కువ ధరకు తిరిగి దక్కించుకునే ప్రయత్నం చేయండి' అని అశ్విన్ సూచించాడు. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
సచిన్‌తో కలిసి గల్లీ క్రికెట్ ఆడిన బ్రిటన్ యువరాజు విలియం, యువరాణి కేథరీన్