1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
  4. Father Kills Infant, Assaults Wife Over Suspicion

ఆ బిడ్డ నాకు పుట్టలేదు.. రెండు నెలల పసికందును చంపేసిన తండ్రి

Crime
Crime
నిజామాబాద్‌‌లో ఘోరం జరిగింది. నిజామాబాద్‌, అశోక్ నగర్‌లో రెండు నెలల కుమారుడు ప్రేమ్‌ను తనకు పుట్టలేదనే అనుమానంతో తండ్రి యువరాజ్ కత్తితో పొడిచి చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని రైల్వే ట్రాక్‌పై పడేశాడు. భార్య ప్రియాంక ఫిర్యాదుతో మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు, విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
 
వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని నయాగావ్‌కు చెందిన యువరాజ్‌, నిజామాబాద్‌లోని అశోక్‌నగర్ కాలనీకి చెందిన ప్రియాంక ఏడాది కిందట వివాహం చేసుకున్నారు. కొన్ని నెలలపాటు వారి బంధం అన్యోన్యంగా సాగింది. ఆ తర్వాత ప్రియాంకపై యువరాజ్ అనుమానం పెంచుకోవడం ప్రారంభించాడు.
 
ప్రియాంకను అనుమానిస్తూ ప్రతిరోజూ వేధించడం మెుదలుపెట్టాడు. మరోవైపు ఆమె గర్భం దాల్చడంతో వేధింపులు మరింత పెరిగాయి. ఇటీవల పుట్టింటికి వచ్చిన బాధిత తల్లి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే, చిన్నారి తనకు పుట్టలేదంటూ ప్రియాంక కుటుంబ సభ్యులతో పలుమార్లు యువరాజ్ గొడవకు దిగాడు. 
 
ఈ నేపథ్యంలోనే జూన్ 17న చిన్నారిని ఇంటి నుంచి తీసుకెళ్లిపోయాడు. అనంతరం నిర్మానుష్య ప్రదేశంలో బాలుడిని కత్తితో పలుమార్లు నరికి హత్య చేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని రైల్వే పట్టాల పక్కన పడేసి పరారయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
ఆరు లేన్ల కారిడార్‌గా నెల్లూరు- తడా హైవే 16.. ఇక ట్రాఫిక్‌కు బైబై