సంబంధిత వార్తలు
- ప్రిన్సిపాల్ గదిలోనే దళిత బాలికపై అత్యాచారం.. ఆన్లైన్లో వీడియో
- ఇజ్రాయేల్ టూరిస్ట్ మహిళపై సామూహిక అత్యాచారం
- Kerala: టీనేజ్ అథ్లెట్‌పై కోచ్, క్లాస్మేట్ల అత్యాచారం.. దాదాపు ఐదేళ్లలో 60మంది?
- అన్నా యూనివర్శిటీ ప్రాంగణంలోనే విద్యార్థినిపై సామూహిక అత్యాచారం
- ఆంటీ.. అత్యాచారం అంటే ఏమిటి అని అడిగిన 48 గంటలకే బాలికపై గ్యాంగ్ రేప్
వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచారం.. నిందితులంతా సహచరులే...
కర్నాటక రాష్ట్రంలోని బెళగావిలో దారుణం జరిగింది. వైద్య విద్యార్థినిపై సహచర విద్యార్థులే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కర్నాటకలోని బెళగావికి చెందిన 22 యేళ్ల బాధితురాలు మహారాష్ట్రంలోని సాంగ్లి జిల్లాలో ఎంబీబీఎస్ తృతీయ సంవత్సరం విద్యాభ్యాసం చేస్తోంది. ఈ నెల 18వ తేదీన రాత్రి 10 గంటలకు తన సహచర విద్యార్థులతో కలిసి సినిమా చూడాలని భావించింది.
అయితే, వారిలో ఒకరు ఆమెను తన ప్లాట్‌కు తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడ ఓ వైద్య విద్యార్థితో పాటు ఓ యువకుడు కూడా ఉన్నారు. వీరంతా అప్పటికే మద్యం సేవసించివున్నారు. గదికి వచ్చిన వైద్య విద్యార్థినికి కూడా స్పైక్డ్ డ్రింక్ ఇచ్చారు. అది తాగిన తర్వాత ఆమె స్పృహ కోల్పోయింది. దీంతో ఒకరి తర్వాత ఒకరు ముగ్గురు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
ఆ యువతి స్పృహలోకి వచ్చిన తర్వాత తనకు జరిగిన ఘోరాన్ని తెలుసుకుని వారిని నిలదీసింది. దాంతో ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ ముగ్గురు నిందితులు బెదిరించారు. కానీ, బాధిత యువతి తనకు జరిగిన ఘోరాన్ని తన తల్లిదండ్రులకు చేరవేసింది. దీంతో వారు విశ్రాంబాగ్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు నిందితులపై బీఎన్ఎస్ సెక్షన్ కింద గ్యాంగ్ రేప్, ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
నిందింతులు ముగ్గురుని అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురు పూణె, షోలాపూర్, సాంగ్లికి చెందిన వారిగా గుర్తించారు. వీరంతా 20 నుంచి 22 యేళ్లలోపువారేనని వెల్లడించారు. వీరిని కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు.
