గువ్వల చెరువు ఘాట్ రోడ్డు మలుపు వద్ద ఘోరం ... ఐదుగురు స్పాట్ డెడ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సి.కె.దిన్నె మండలం గువ్వల చెరువు ఘాట్ రోడ్డు వద్ద ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారుపై ఓ లారీ దూసుకెళ్లడంతో ఈ ఘోరం జరిగింది.
ఈ ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఓ చిన్నారి, ముగ్గురు మహిళలు ఉన్నారు. రాయచోటి నుంచి కడపకు కారులో వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న పోలీసులు.. ప్రమాదస్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని సమీపంలోని ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.