శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 4 ఫిబ్రవరి 2022 (19:17 IST)

రాజస్థాన్‌లో దారుణం : నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం

రాజస్థాన్ రాష్ట్రంలో దారుణం జరిగింది. నాలుగేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి బంధువు ఈ కిరాతక చర్యకు పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
రాష్ట్రంలోని జలోర్‌లోని లేటా గ్రామానికి చెందిన నారాయణ్ మేఘావాల్ (25) అనే వ్యక్తి బాధితురాలి తండ్రితో కలిసి వచ్చాడు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆ బాలికపై అత్యాచారానికి తెగబడ్డాడు. 
 
ఈ బాలిక అరుపులు విన్న కన్నతండ్రి... ఆమె కోసం ఇంట్లోకి పరుగెత్తాడు. అయితే అప్పటికే ఆ బాలిక తీవ్ర రక్తస్రావంతో బాధపడుతూ బిగ్గరగా ఏడ్వసాగింది. దీంతో మేఘవాల్‌ అక్కడ నుంచి పారిపోయాడు. 
 
దీనిపై బాధిత తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో కామాంధుడు మేఘవాల్‌ను కేవలం రెండు గంటల్లోనే అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.