రాజీనామాకు సిద్ధమవుతున్న ఎమ్మెల్యే రోజా.. కారణం ఏంటంటే?
నగరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రోజాకు సొంత నేతల ద్వారానే ఇంటి పోరు తప్పట్లేదు. రోజాను తప్పించేందుకు నగరి వైకాపా నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. దీంతో ఆవేదనకు గురైన ఫైర్ బ్రాండ్, ఎమ్మెల్యే ఆర్కే రోజా.. అవసరం అయితే రాజీనామాకైనా సిద్ధమని వార్తలు వస్తున్నాయి. అలాగే రోజా అసంతృప్తికి మరో కారణం కూడా వుంది. అదేంటంటే.. శ్రీశైలం బోర్డు చైర్మన్ నియామకమే.
తాజాగా, శ్రీశైలం బోర్డు చైర్మన్‌గా చెంగారెడ్డి చక్రపాణిరెడ్డిని నియమించారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అయితే, ఈ వ్యవహారం రోజాకు మింగుడుపడడం లేదు.. చక్రపాణిరెడ్డికి పదవి ఇవ్వడంపై రోజా కినుకు వహించారు. కాగా, స్థానిక ఎన్నికల్లో రోజా, చక్రపాణిరెడ్డి మధ్య వివాదం చోటు చేసుకుంది.
తాజాగా, ఆయనకు పదవి రావడంపై ఆవేదనకు గురైన రోజా.. ఈ వ్యవహారాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తానని చెప్తున్నారు. అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. మరి ఈ వ్యవహారం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి.