సంబంధిత వార్తలు
- ఇడ్లీ వెయ్యేళ్ల చరిత్ర.. ఇడ్లీ ఇండోనేషియాలో పుట్టిందా.. ఇండియాలో పుట్టిందా?
- హార్దిక్ పాండ్యా, మహికాలకు పెళ్లైపోయిందా? ఆ సింధూరం మిస్టరీ ఏంటి?
- టెక్కీ రాధా గాయత్రి మృతి కేసు : విచారణకు సహకరించాలని చెప్పా : శ్రీచరణ్ తండ్రి
- చూస్తే నిజం, చూడకపోతే అనుమానాలు పాయింటే గేదెల రాజు : చైతన్య మోటూరి
- ఇంతకీ ఇమ్రాన్ ఖాన్ వున్నాడా? చంపేసారా? పాకిస్తాన్ చీలిపోతుందా?
షాబాద్ సీరియల్ హత్య కేసుల్లో వీడని చిక్కు ముడులు...
తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన షాబాద్ వరుస హత్యల కేసులో ఉన్న చిక్కుముడులు వీడట్లేదు. పోక్సో కేసు పెట్టిందని బాలిక, ఆమె తల్లి, నానమ్మను, తనతో గొడవ పడుతోందని భార్య, ఇద్దరు పిల్లల్ని.. నిందితుడు రాజ్‌కుమార్ హతమార్చాడు. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.
నిందితుడి కథ సమాప్తమైనా అసలు భార్య, పిల్లల్ని ఎందుకు చంపాడన్నది అంతుచిక్కని మిస్టరీగానే ఉంది. సెల్ఫీ వీడియోలో నిందితుడు రాజ్‌కుమార్.. బాలిక కుటుంబం గురించి, పోక్సో కేసు విషయం ప్రస్తావించాడు. భార్య, పిల్లల్ని చంపాలని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు. అందుకు కారణాలేంటో వెల్లడించకపోవడం పోలీసులకు సవాలుగా మారింది.
నిందితుడు రాజ్‌కుమార్ దాదాపు ఏడాది నుంచి బాలికను వేధిస్తున్నాడు. ఈ విషయం తెలిసి భార్య సరిత పలుమార్లు నిలదీయడంతో రోజూ గొడవలు జరిగేవని స్థానికులు చెబుతున్నారు. ఈ గొడవలు కొనసాగుతుండగానే షాబాద్ ఠాణాలో పోక్సో కేసు నమోదైంది. దీంతో మళ్లీ గొడవలు మొదలయ్యాయి. సరిత పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టాలనుకున్నా.. రాజ్‌కుమార్ పరారీలో ఉండడంతో సాధ్యపడలేదు. కోర్టు ముందస్తు బెయిలు మంజూరు చేశాక.. మళ్లీ గ్రామంలో ప్రత్యక్షమయ్యాడు.
బాలికను ఎలాగైనా పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో గొడవలు తీవ్రమయ్యాయి. ఈ క్రమంలోనే సరిత.. పెద్దకుమారుడిని మొయినాబాద్‌లోని మేనమామ ఇంటికి పంపింది. ఇక నుంచి సక్రమంగానే ఉంటానంటూ రాజ్‌కుమార్ కొన్నిరోజుల కిందటే కుమారుడిని తీసుకొచ్చాడు. అకస్మాత్తుగా శుక్రవారం రాత్రి రాజ్‌కుమార్ భార్యాపిల్లల్ని హతమార్చిన విషయం తెలిసిందే. భార్య తనను ఎదిరించిందనే కోపంతోనే చంపినట్లు అనుమానిస్తున్నా.. పిల్లల్ని చంపడం వెనుక బలమైన కారణం ఉంటుందని భావిస్తున్నారు.
