1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
  4. Nandyal horror father kills 22 year old bba graduate son over constant harassment

మానసికస్థితి సరిగా లేని కొడుకు నిత్యం వేధిస్తున్నాడనీ కడతేర్చిన తండ్రి...

murder
మానసికస్థితి సరిగా లేని కొడుకు నిత్యం వేధిస్తున్నాడనీ కన్నతండ్రి కడతేర్చాడు. ఆ తండ్రి క్షణికావేశం కన్నకొడుకు ప్రాణాలు పోయాయి. మానసిక పరిస్థితి సరిగ్గా లేని కుమారుడు నిత్యం వేధిస్తుండటంతో ఆందోళనకు గురైన తండ్రి కట్టెతో కొట్టి చంపాడు. ఈ ఘటన నంద్యాల జిల్లా కోవెలకుంట్ల మండలం కంపమల్లలో బుధవారం జరిగింది. 
 
స్థానిక పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన వసుంధరరావు, లీలావతి దంపతులకు కుమారుడు, కుమార్తె సంతానం. పెద్దవాడైన వంశీకృష్ణ (22) బెంగళూరులో బీసీఏ చదివి, ఆరు నెలలుగా ఇంటివద్దే ఉంటున్నాడు. అతడి మానసిక పరిస్థితి సరిగ్గా లేక ఇంట్లో గొడవపడుతూ తల్లిదండ్రులను వేధించేవాడు. 
 
ఈ క్రమంలో బుధవారం రాత్రి తల్లిని కొట్టి ఇంట్లోని వస్తువులను పగలగొట్టి భయభ్రాంతులకు గురిచేశాడు. వంశీకృష్ణ బతికుంటే తమను చంపుతాడేమోనని భయపడిన తండ్రి... అతడి తలపై కట్టెతో కొట్టి చంపాడని ఎస్ఐ తెలిపారు. ఈ ఘటనపై వంశీకృష్ణ తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి