1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
  4. Raidurgam man held for assault, cheating, blackmail

మత్తుమందిచ్చి స్పృహ కోల్పోయాక ఉద్యోగినిపై అత్యాచారం.. వ్యక్తి అరెస్ట్

rape
హైదరాబాదులో ఓ ఉద్యోగినిపై అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో  ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్న యువతిని టార్గెట్ చేసి, అక్కడే ఫుడ్‌వెండర్‌గా పనిచేస్తున్న షేక్‌నబీ అనే వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి బాధితురాలికి ఇచ్చి, ఆమె స్పృహ కోల్పోయిన సమయంలో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. 
 
ఇంకా ఈ తతంగాన్ని రికార్డ్ చేసి.. బాధితురాలికి బ్లాక్ మెయిల్ చేస్తూ వచ్చాడు. ఎవరికైనా చెబితే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతూ, అప్పటి నుంచి 2026 ఆగస్టు వరకు వివిధ సందర్భాల్లో పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. 
 
నిందితుడి వేధింపులు రోజురోజుకూ మితిమీరిపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాధితురాలు ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 
 
2023లో బాక్స్ క్రికెట్ ఆట అనంతరం కంపెనీ ఉద్యోగులు ఏర్పాటు చేసిన పార్టీలో, నబీ తనకు తెలియకుండా తన సాఫ్ట్ డ్రింక్‌లో మత్తుపదార్థం కలిపి, తనపై లైంగిక దాడి చేసి, వీడియోలు, ఫోటోలు తీశాడని ఆ మహిళ ఆరోపించింది. 
 
ఆ తర్వాత నబీ తనను ఒక రెస్టారెంట్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టేలా ఒప్పించి, సుమారు రూ. 43 లక్షలు వసూలు చేశాడని, ఆమె అంగీకరించకపోతే ఆ వ్యక్తిగత విషయాలను తన భర్త, పిల్లలు, బంధువులకు పంపుతానని బెదిరించడానికి ఉపయోగించాడని ఆమె ఇంకా ఆరోపించింది.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
డజను మంది ఎమ్మెల్యే రెండో పెళ్లిళ్లు చేసుకున్నారు : కర్నాటక సీఎం డీకే