1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
  4. Renigunta : Wife killed Husband

భర్త తల తెగనరికిన భార్య.. స్టేషన్‌కెళ్లి లొంగిపోయింది..

Renigunta
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా రేణిగుంటలో దారుణం జరిగింది. కట్టుకున్న భర్త తెలను భార్య తెగనరికింది. ఆ తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన వివరాలను పరిశీలిస్తే,
 
చిత్తూరు జిల్లాలో రేణిగుంట పట్టణంలో వసుంధర, రవీచందర్ అనే దంపతులు ఉన్నారు. వీరిమధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఇరుగు పొరుగువారు జోక్యం చేసుకుని సర్ధిచెప్పినప్పటికీ వారు వినలేదు. ఈ క్రమలో భర్త తలను భార్య నరికేసింది. 
 
ఆ తర్వాత రేణిగుంట పట్టణ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి ఆమెను అరెస్టు చేశారు. మృతదేహాన్ని స్వాధీంనం చేసుకుని శవపంచానామా కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
గృహ హింస కేసులో గెలిచిన మాజీ మంత్రి కన్నా కోడలు.. రూ.కోటి పరిహారం