సంబంధిత వార్తలు
- Pawan: పవన్ కళ్యాణ్ తో సురేందర్ రెడ్డి చిత్రం ఎలా వుండబోతోంది !
- పవన్ సినిమాల్లో నటిస్తే అభ్యంతరం : హైకోర్టు ప్రశ్న
- Ramchran: పుట్టినరోజు కు ముందు పెద్దికి గాయాలు - కోలుకోవాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్ష
- నియోజకవర్గాల పునర్విభజనతో ఏపీకి ఎంతో మేలు.. పవన్ కల్యాణ్
- కొత్త చిత్రాలకు కమిట్ కాలేదు.. 'ఓజీ-2'పై త్వరలో అప్డేట్
రామతీర్థం వద్ద గిరి ప్రదక్షిణ.. పవన్ కల్యాణ్ చేతుల మీదుగా ప్రారంభం
Rama Teertham
సీతారాముని పేట జంక్షన్ నుంచి నీలాచలం కొండ వరకు 3.70 కిలోమీటర్ల మేర జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రూ.3.40 కోట్లతో బిటి రోడ్డుగా అభివృద్ధి చేశారు. కార్యక్రమంలో మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కె.అప్పలనాయుడు, ఎమ్మెల్యే లోకం మాధవి పాల్గొన్నారు.
గతంలో రాళ్లు, ముళ్లతో నిండి ఉండి, యాత్రికులకు ఇబ్బందులు కలిగించిన ఈ మార్గాన్ని స్థానికులు, ప్రజా ప్రతినిధుల విజ్ఞప్తుల మేరకు వాహనాలు ప్రయాణించడానికి వీలైన రహదారిగా అభివృద్ధి చేశారు. ఆలయాల అభివృద్ధికి, సంప్రదాయాల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 22 ఆలయాలకు రహదారి సౌకర్యాలను మెరుగుపరచడానికి గత 20 నెలల్లో రూ.40 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు ఆయన తెలిపారు. అలాగే, ఇతర ఆలయాల వద్ద కూడా ఇటువంటి పనులు కొనసాగుతున్నాయని ఆయన వెల్లడించారు.
