1. వార్తలు
  2. బిజినెస్
  3. కథనాలు
  4. Key Trends Driving Increased Credit Cards Usage in India

భారతదేశములో క్రెడిట్ కార్డుల వినియోగం పెరగడాన్ని ప్రోత్సహిస్తున్న ప్రధాన పోకడలు ఏంటి?

credit card
ఆకాంక్షపూరిత జీవనశైలి, డిజిటల్-ఫస్ట్ లావాదేవీలు, అనువైన చెల్లింపు ఎంపికల అవలంబనలను ప్రతిబింబించే ఖర్చు చేసే వైఖరులతో భారతదేశపు వినియోగ విధానము వేగంగా మారుతోంది. గత దశాబ్ద కాలములో, పెరుగుతున్న ఆదాయాలు, విస్తరిస్తున్న పట్టణీకరణ, రోజురోజుకు పెరుగుతున్న ఆకాంక్షలతో ఉన్న మధ్యతరగతి, ప్రజలు ఎలా ఖర్చు చేస్తారు, ఎక్కడ ఖర్చు చేస్తారు అనేదానికి కొత్త ధోరణిని ప్రారంభించారు. ఎఫ్‎వై’26లో సుమారు 118.6 మిలియన్ క్రెడిట్ కార్డులు సర్క్యులేషన్లో ఉండగా, రూ. 23.62 ట్రిలియన్ పైగా క్రెడిట్ కార్డ్ ఖర్చులతో, ఎకోవ్యవస్థ విస్తరణ నుండి వినియోగానికి మారుతోంది.
 
క్రెడిట్ కార్డ్ వినియోగదారులు అవసరాలతోపాటు, ఎక్కువగా అనుభూతులు, జీవనశైలి విభాగాలలో ఖర్చు చేస్తున్నారని, డిజిటల్ ప్లాట్ఫార్మ్స్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారని భారతదేశపు అతిపెద్ద ప్యూర్-ప్లే క్రెడిట్ కార్ ప్లేయర్ అయిన ఎస్‎బిఐ కార్డ్ అంతర్దృష్టులు సూచిస్తున్నాయి.
 
మారుతున్న వినియోగదారుడి ప్రవర్తన
పెరుగుతున్న ఆదాయాలు, అవగాహన వలన, భారతీయ వినియోగదారుల ఖర్చు చేసే పద్ధతి ఎక్కువగా ఆకాంక్షాత్మకం, అనుభూతి-ఆధారంగా అవుతోంది. ఇది విచక్షణతో కూడిన ఖర్చు కొరకు వినియోగదారుడి సామర్థ్యము వైపుకు మార్పును ప్రాధాన్యీకరిస్తుంది. రీటెయిల్ ఖర్చులు 15% YoY వృద్ధితో, రూ.3.54 ట్రిలియన్ పైగా ఇదివరకెన్నడు లేని అత్యధికానికి చేరుకున్నాయని ఎస్‎బిఐ కార్డ్స్ ఎఫ్‎వై’26 డేటా సూచిస్తుంది. రీటెయిల్ ఖర్చులలో ఆన్లైన్ ఖర్చులు సుమారు 62.5% వరకు ఉన్నాయి. ఇది తప్పనిసరి, ఇష్టపూర్వక వర్గాలలో డిజిటల్-ఫస్ట్ వినియోగము వైపుకు పెరుగుతున్న మొగ్గును ప్రతిబింబిస్తుంది.
 
వినియోగదారుడి ప్రమేయం, సౌకర్యానికి వ్యక్తిగతీకరించబడిన, అంతరాయం లేని అనుభవాలు, సెల్ఫ్-సర్వీస్-ఆధారిత డిజిటల్ ప్లాట్ఫార్మ్స్ సమగ్రంగా మారుతున్నాయి. ఎస్‎బిఐ కార్డ్ ప్రకారం, లక్షలమంది వినియోగదారులు ఒక కొత్త కార్డ్ కొరకు దరఖాస్తు చేయడం నుండి సమస్యా పరిష్కారము వరకు తమ వివిధ అవసరాల కొరకు తరచూ, ఎస్‎బిఐ కార్డ్ మొబైల్ యాప్, లైవ్ చాట్ ఏకీకృతం చేయబడిన అస్క్ ILA చాట్‎బోట్, వాట్సాప్ సర్వీస్ వంటి ఎస్‎బిఐ కార్డ్ యొక్క డిజిటల్ ప్లాట్ఫార్మ్స్‌ను వినియోగిస్తున్నారు. ఈరోజు, మెరుగైన వినియోగదారుడి అనుభవముపై దృష్టి కేంద్రీకరించిన కారణంగా, ఎస్‎బిఐ కార్డ్ మొబైల్ యాప్ గూగుల్ ప్లే మరియు యాప్ స్టోర్ పై వరుసగా 4.6, 4.5 రేటింగ్ కలిగి ఉంది.
 
భారతదేశములో మారుతున్న క్రెడిట్ కార్డ్ ఎకోవ్యవస్థపై వ్యాఖ్యానిస్తూ, సలిల పాండే, ఎండి & సీఈఓ, ఎస్‎బిఐ కార్డ్, ఇలా అన్నారు, పెరుగుతున్న ఆదాయము మరియు కోరికలు, ప్రగతిశీల విధానాలు, డిజిటైజేషన్, పెరుగుతున్న చెల్లింపు మౌలికసదుపాయాలు క్రెడిట్ కార్డ్, లావాదేవీలను పునర్నిర్మిస్తున్నాయి. వినియోగదారులు ఎక్కువగా అనుభవాలు, జీవనశైలి-ఆధారిత కొనుగోళ్ళు, అంతరాయం లేని దైనందిన లావాదేవీల వైపుకు ఆకర్షితులు అవుతున్నారు. ఇది మరింత ఆత్మవిశ్వాసం, అభివృద్ధి చెందుతున్న మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ఎస్‎బిఐ కార్డ్ వద్ద మేము, అభివృద్ధి చెందుతున్న భారతదేశపు డిజిటల్ చెల్లింపుల విధానానికి దోహదపడుతూ, ఈ పెరుగుతున్న అవసరాలను నెరవేర్చుటకు అర్థవంతమైన భాగస్వామ్యాలు, ఆవిష్కరణల ద్వారా మా ఉత్పత్తి శ్రేణిని మరింత బలోపేతం చేయడం పై కృషి చేస్తున్నాము.
 
క్రెడిట్ కార్డ్స్ పై యూపిఐ ప్రతిరోజు వినియోగాన్ని వేగవంతం చేస్తుంది
రోజువారి లావాదేవీలకు యూపిఐ ప్రధానంగా ఆవిర్భవిస్తుండడముతో భారతదేశపు డిజిటల్ చెల్లింపు వ్యవస్థ వేగంగా మారింది. రోజువారి లావాదేవీలలో తన పాత్రను విస్తరిస్తున్న, పెరుగుతున్న యూపిఐ-అనుసంధానిత క్రెడిట్ కార్డ్స్ వినియోగము ఈ వ్యవస్థలో గుర్తించదగిన మార్పు. ఎస్‎బిఐ కార్డ్ యొక్క Q4 ఎఫ్‎వై’26 డేటా ప్రకారం, డిపార్ట్మెంటల్ దుకాణాలు-సరుకులు, యుటిలిటీస్, ఇంధనము, దుస్తులు, రెస్టారెంట్ల వంటి రంగాల ద్వారా నడపబడుతున్న యూపిఐ-అనుసంధానిత క్రెడిట్ కార్డ్స్ ఖర్చులు 10% QoQ పైగా పెరిగాయి. ఇది పెరుగుతున్న వినియోగదారుడి సౌకర్యము మరియు విశ్వాసాన్ని సూచిస్తుంది.
 
టైర్ 2+నగరాలకు విస్తరించిన క్రెడిట్ కార్డ్ వినియోగము
పెరుగుతున్న ఆదాయాలు, మెరుగైన డిజిటల్ అవగాహన మరియు విస్తరిస్తున్న చెల్లింపు మౌలికసదుపాయాలతో క్రెడిట్ కార్డ్ వినియోగము మెట్రోపాలిటన్ మార్కెట్స్ దాటి విస్తరిస్తోంది. చిన్న-టికెట్ కొనుగోళ్ళ సహా వారి రోజువారి ఖర్చుల కొరకు కూడా చిన్న నగరాలలో ఉన్న వినియోగదారులు నిరంతరాయంగా క్రెడిట్‌ను ఉపయోగించడాని అనుకూలపరచడానికి యూపిఐతో రూపే క్రెడిట్ కార్డ్ యొక్క ఏకీకరణ ఈ ధోరణిని మరింత వేగవంతం చేస్తోంది.
 
సుమారు 77% యూపిఐ-క్రియాశీలక క్రెడిట్ కార్డ్ వినియోగాఅరులు, సుమారు 81% యూపిఐ-క్రెడిట్ ఖర్చులు టైర్ 2, టైర్ 3 నగరాల నుండి ఉద్భవిస్తున్నాయని ఎస్‎బిఐ కార్డ్ డేటా సూచిస్తుంది. ఇది అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో డిజిటల్ క్రెడిట్ వినియోగాన్ని ప్రాధాన్యీకరిస్తుంది. ఆర్ధిక చేరికకు సహకరించుటలో క్రెడిట్ కార్డ్ పాత్రను పునరుద్ఘాటిస్తుంది.
 
బహుళ-కార్డ్ వినియోగము వైపు పెరుగుతున్న ప్రాధాన్యత
వినియోగదారులు వివిధ ఖర్చుల కొరకు బహుళ క్రెడిట్ కార్డ్స్‌ను వినియోగించడము వైపు వినియోగదారులు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఉదాహరణకు, ప్రయాణం కోసం ఎస్‎బిఐ కార్ మైల్స్, సంక్షేమము కొరకు ఎస్‎బిఐ కార్డ్ పల్స్, ఇంధనం ఒరకు బిపిసిఎల్ ఎస్‎బిఐ కార్డ్, జీవనశైలి ఖర్చుల కోసం ఫ్లిప్‎కార్ట్ ఎస్‎బిఐ కార్డ్, డిజిటల్ లావాదేవీల కోసం ఫోన్‎పే మొదలైనవి.
 
డిజిటల్ పరిజ్ఞానం ఉన్న వినియోగదారులలో పెరుగుతున్న ఇటువంటి క్రెడిట్ కార్డ్స్ వినియోగం, వర్గ-నిర్దిష్ట ప్రయోజనాలు, వ్యక్తిగతీకరించబడిన రివార్డులు, ఎకోవ్యవస్థ-ఆధారిత విలువ నిష్పత్తుల వైపు పెరుగుతున్న మొగ్గును ప్రతిబింబిస్తుంది. ఈ వైఖరి షాపింగ్, ప్రయాణము, జీవనశైలి, రోజువారి ఖర్చుల వర్గాలలో ఎక్కువ అనుభవం-ఆధారిత కార్డ్ వినియోగము పట్ల మారుతున్న వినియోగదారుడి ప్రవర్తనను తెలుపుతుంది. 
 
క్రెడిట్ కార్డ్స్ ద్వారా ఈఎంఐల ఆధారిత కొనుగోళ్ళు
ఎస్‎బిఐ కార్డ్ ఎఫ్‎వై’26 డేటా ప్రకారం, ఈఎంఐ ఖర్చులు ఆరోగ్యకరమైన రెట్టింపు సంఖ్య YoY వృద్ధిని చవిచూశాయి. గ్యాడ్జెట్స్, వినియోగదారు వినిమయాలు మొదలైనవాటి కొనుగోళ్ళను మరింత సరసమైనవి మరియు సౌకర్యవంతమైనవిగా చేస్తాయి కాబట్టి వినియోగదారులు ఎక్కువగా ఈఎంఐ-ఆధారిత లావాదేవీలకు ఎంచుకుంటున్నారు. అధిక విలువ కొనుగోళ్ళ కొరకు వాయిదాలలో చెల్లింపులు చేసే విధానము మెట్రోలను దాటి టైర్ 2+ నగరాలకు విస్తరిస్తోంది. ఇది లోతైన క్రెడిట్ చొరబాటు మరియు పెరుగుతున్న ఖర్చు ధోరణులను ప్రతిబింబిస్తుంది.
 
ఈ పెరుగుతున్న డిమాండ్‌ను అందుకోవటానికి, ఎస్‎బిఐ కార్డ్ వంటి కంపెనీలు ఆఫర్లు అందించుటకు, స్మార్ట్‎ఫోన్స్, వినియోగదారు వినిమయాలు, గ్యాడ్జెట్స్, ఫర్నిషింగ్ సహా అనేక రంగాలలో అనువైన చెల్లింపు ఎంపికల కొరకు ప్రముఖ బ్యాండ్స్‌తో భాగస్వామ్యముపై శ్రద్ధ పెడుతున్నారు.
About Writer
ఐవీఆర్