1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Andhra Pradesh: Four killed, one critically injured as lorry rams into car in Prakasam

బెంగుళూరు నుంచి ఏపీలో ఓటు వేయడానిక వస్తూ మృత్యువాత

road accident
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఆదివారం రెండో దశ పోలింగ్ జరుగుతోంది. ఈ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు వస్తూ నలుగురు తిరిగిరాని లోకాలకు చేరుకున్నారు. ప్రకాశం జిల్లా టంగుటూరు టోల్‌ప్లాజ్ వద్ద ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. బెంగుళూరు నుంచి స్వగ్రానికి వెళుతుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. 
 
అద్దంకి మండలం, చెరుకంపాలెం గ్రామానికి చెందిన ఐదుగురు వ్యక్తులు పంచాయతీ ఎన్నికల రెండో దశలో ఓటు వేయడానికి బెంగుళూరు నుంచి కారులో బయలుదేరారు. వారు ప్రయాణిస్తున్న కారు టంగుటూరు టోల్‌ప్లాజా వద్ద రుసుము చెల్లించేందుకు ఒక ప్రైవేటు బస్సు వెనుక ఆగింది. అదేసమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ లారీ అదుపుతప్పి కారును బలంగా ఢీకొట్టింది. 
 
ఈ ఘటనలో బస్సు లారీల మధ్య బస్సు ఇరుక్కుని నుజ్జునుజ్జు అయింది. కారులో ఉన్న సోంపల్లి సాయికుమార్, కోట కామేశ్వరమ్మతో పాటు మరో వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో మహిళను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయింది. అయితే, కారులో ప్రయాణిస్తున్న 15 యేళ్ళ బాలుడు మాత్రం ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాడు. 
 
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు హైవేపై పోలీసులు, అగ్నిమాపకదళ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ అక్కడ నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
తల్లిదండ్రులు చంపాలని చూస్తే... చెట్టు కొమ్మను పట్టుకుని ప్రాణాలు కాపాడుకున్న బాలిక