1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. If there is evidence, why give Nagarjuna Yadav a two-week deadline?

ఆధారాలు ఉంటే నాగార్జున యాదవ్‌కి రెండు వారాల గడువు ఎందుకు?

Siva Parvati
జనసేన పార్టీ ప్రారంభం నుంచి వీర మహిళలను ముందు వుండి నడిపించినవారు కోట రుక్మిణి గారు అని జనసేనపార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీమతి శివపార్వతి అన్నారు. బాధితురాలైన రుక్మిణి గారిని నేరస్తురాలిలా చిత్రిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. ఆమె మాట్లాడుతూ... రుక్మిణి గారిపై ఏమైనా ఆధారాలు ఉంటే నాగార్జున యాదవ్‌కి రెండు వారాల గడువు ఎందుకు?
 
పనికిరాని సాక్షి పేపర్ లాంటి చిత్తు కాగితాలు చేతిలో పెట్టుకుని ఆడవారిపై నోటికొచ్చినట్టు మాట్లాడే హక్కు ఎవరిచ్చారు? ఇన్నాళ్లు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేశారు, ఇప్పుడు జనసేన పార్టీలో పని చేసే మహిళలపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. కానీ మేము ఏనాడు మీ నాయకుడి సతీమణి, తల్లి, చెల్లిపై తప్పుడు మాటలు మాట్లాడలేదు.
 
సమాజానికి పట్టిన చీడపురుగు వైఎస్సార్సీపీ. 11 వచ్చినా వైసీపీకి బుద్ధి రాలేదు, 24 గంటలు పవన్ కళ్యాణ్ గారిపై పడి ఏడవటమే. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే ధరణి కృష్ణ అనే వ్యక్తిపై ఈ తరహా వ్యవహారాలపైనే నాలుగు FIRలు నమోదైనా ఒక్కసారీ చర్యలు తీసుకోలేదు. ఎందుకంటే వైసీపీ నేరస్థులకు మద్దతిచ్చే పార్టీ అని మండిపడ్డారు.
About Writer
ఇమ్మడిశెట్టి వెెంకట్
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(NIFT) హైదరాబాదులో సిపిఎఫ్‌సి కోర్సు చేసారు. జర్నలిజంలో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం. కవితలు, కథలు రాస్తుంటారు. ప్రముఖ మీడియా సంస్థలైన ETv, ETv2లో పనిచేసారు. స్వాతి సపరివారపత్రిక, సండే ఇండియన్ మ్యాగజైన్ల ఎడిటోరియర్ విభాగంలో పనిచేసారు. 2006 నుంచి వెబ్ దునియా తెలుగు- Webdunia Telugu సహ సంపాదకునిగా వ్యవహరిస్తున్నారు. .... మరింత చదవండి
తర్వాతి కథనం
తిరుపరంకుండ్రం కొండపై దీపం... వెట్రివేల్ మురుగనుక్కు అరోగరా ప్రధాని ట్వీట్