1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. The song "Mayaledi Chengu Chenguna Dookera" featuring Rakesh Varre and Madhumita Sarkar

రాకేష్ వర్రే, మధుమిత సర్కార్ పై మాయలేడి చెంగు చెంగున దూకెరా.. సాంగ్

Rakesh Varre and Madhumita Sarkar
హీరో, ప్రొడ్యూసర్ రాకేష్ వర్రే చేస్తున్న కొత్త సినిమా "మాయలేడి".  ఈ సినిమాను దర్శకుడు ప్రశంకర్ రూపొందిస్తున్నారు. మధుమిత సర్కార్ హీరోయిన్ గా నటిస్తోంది. త్వరలోనే "మాయలేడి" సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.
 
ఈ రోజు "మాయలేడి" సినిమా నుంచి మేకర్స్ టైటిల్ సాంగ్ 'మాయలేడి..' రిలీజ్ చేశారు. విశాల్ చంద్రశేఖర్ కంపోజ్ చేసిన బ్యూటిఫుల్ ట్యూన్ కు కృష్ణకాంత్ ఆకట్టుకునే లిరిక్స్ అందించారు. సింగర్స్ అరవింద్ అనెస్ట్, శిబి శ్రీనివాసన్, వేలు, పిటీ విక్రమ్, దేవ్ మాత్యూ, కవిత ఇలంగో అంతే అందంగా పాడారు. 'మాయలేడి..' పాట ఎలా ఉందో చూస్తే - 'మాయలేడి చెంగు చెంగున దూకెరా, మాయలేడి గుండె ఠక్కున దోచెరా, మిస్టరీతో మంత్రమేదో వేసే కొత్తబొమ్మ మార్చెనేమో నన్నే, పక్కనుంటే తానే నచ్చుతుంది ఏంటో తెలియదుగా, ఎవడు వీడు అపరిచితుడు, అయినవాడల్లే ఉన్నాడు, చదువుతాడు, కనులే చూస్తూ ఉంటాడు..' అంటూ సాగే ఈ పాటను హీరో హీరోయిన్స్ మధ్య క్యూట్ లవ్ సాంగ్ గా చిత్రీకరించారు.
 
ఇటీవల రిలీజ్ చేసిన "మాయలేడి" సినిమా గ్లింప్స్ కు హ్యూజ్ రెస్పాన్స్ దక్కింది. ఒక ఇంట్రెస్టింగ్ బ్యాక్ డ్రాప్ తో సాగే లవ్ స్టోరీని థియేటర్స్ లో చూడబోతున్న ఫీల్ ను ప్రేక్షకుల్లో ఈ గ్లింప్స్ క్రియేట్ చేసింది. 'మాయలేడి..' సాంగ్ కూడా ఇన్ స్టంట్ గా హిట్ అయ్యేలా కనిపిస్తోంది.
About Writer
దేవీ
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
జ్యోతి పూర్వజ్ కిల్లర్ చిత్రం తెలుగు, తమిళ సహా పలు దేశాల్లో విడుదల.