1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. Married Woman Strangles Youth to Death in Dhoolpet

ఎంతకాలం వేధింపులను భరిస్తాం.. చున్నీతో గొంతు నులిమి హత్య చేసిన వివాహిత

Crime News
Crime News
ఎంతకాలం వేధింపులను భరిస్తాం.. ఎంతకాలం వేధించే వాళ్లని చూసి జడుసుకుంటాం.. అని ఓ మహిళ భావించినట్లుంది. అందుకే తనను వేధిస్తున్న వ్యక్తి అంతమొందించింది. హైదరాబాద్‌లోని ధూల్‌పేట్‌లో ఒక వివాహిత మహిళ చున్నీతో ఒక యువకుడి గొంతు నులిమి హత్య చేసింది. మృతుడిని సాయిగా గుర్తించారు. 
 
వివరాల్లోకి వెళితే.. అనీషా సింగ్ అనే మహిళ చున్నీతో సాయి గొంతు నులిమి చంపింది. పదేపదే హెచ్చరించినా గత కొన్ని రోజులుగా సాయి తనను వేధిస్తున్నాడని అనీషా చెప్పినట్లు పోలీసులు తెలిపారు. వేధింపులను భరించలేక ఆ మహిళ ఈ హత్యకు ప్లాన్ వేసింది. పక్కా ప్లాన్ ప్రకారం చున్నీతో గొంతు నులిమి హతమార్చింది. 
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసి, మరణానికి దారితీసిన పరిస్థితులను, ఇందులో మరెవరైనా ప్రమేయం ఉందో లేదో తెలుసుకోవడానికి పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
మయన్మార్ అరాకన్ ఆర్మీ ప్రాంతంలో వైమానిక దాడి.. 49 మంది మృతి