విశాఖపట్నం సెంట్రల్ పార్క్ బయట కరెన్సీ నోట్లు
విశాఖపట్నంలోని సెంట్రల్ పార్క్ బయట బుధవారం ఉదయం కరెన్సీ నోట్లు చెల్లాచెదురుగా పడి ఉండటం కనిపించింది. వీటిలో రూ. 500, రూ. 100, రూ. 50, రూ. 10 విలువైన చిరిగిన నోట్లు ఉన్నాయి. ఈ నోట్లతో పాటు కొన్ని ఎల్‌ఐసీ పాలసీ రశీదులు, ఒక మహిళకు చెందిన పాన్ కార్డు కూడా లభించాయి.
బుధవారం వాకింగ్ వచ్చిన వారు ఈ నోట్లను గమనించి ఆశ్చర్యపోయారు. అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, ఆ కరెన్సీ నోట్లు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. అలాగే పాన్ కార్డులోని వివరాల ఆధారంగా సంబంధిత వ్యక్తిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభమైంది.
