1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Massive set for a Ramayana episode in Varanasi?

SS Rajamouli: వారణాసిలో రామాయణ ఎపిసోడ్ కోసం భారీ సెట్టింగ్ ?

Varanasi set keak
Varanasi set keak
రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోన్న వారణాసి చిత్రంలో ఏదో ఒక అప్ డేట్ వస్తూనే వుంది. తాజాగా షూటింగ్ జరిగే సెట్లో ఆర్ట్ డిపార్ట్ మెంట్ వేసినభారీ వారణాసి సెట్లోని ఓ ద్రుశ్యం సోషల్ మీడియాలో వచ్చేసింది. బహుశా అది నిజమైందా? ఎ.ఐ. టెక్నిక్ అనేది సంశయమైనా ఒరిజినల్ గా సెట్ అనిపించేలా వుండడంతో కథకు అతికినట్లుగా అనిపిస్తుంది. 
 
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రియాంక చోప్రా జోనస్, పృథ్వీరాజ్ సుకుమారన్ కలయికలో రాబోతున్న చిత్రమిది. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమాని ఎప్పటికప్పుడు హాలీవుడ్ మీడియాలో నానేలా ఇంటర్వ్యూస్, పాడ్ కాస్ట్ లు ఇస్తూ వస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఒక 25 నిమిషాల పాటుగా సాగే రామాయణ ఎపిసోడ్ కూడా ఉంటుంది అని అందరికీ తెలిసిందే. కానీ ఈ రామాయణ ఎపిసోడ్ పై సర్ప్రైజింగ్ డీటెయిల్స్ రాజమౌళి రివీల్ చేయడం జరిగింది.
 
కాగా, సుమారు ₹1,300–1,400 కోట్ల అంచనా వ్యయంతో రూపొందుతున్న ఈ చిత్రం, అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న భారతీయ సినిమాల్లో ఒకటిగా నిలవనుంది. కేవలం 4–5 రోజుల్లోనే ₹1,000 కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తుందనే చర్చ ఇప్పుడు ఇంటర్నెట్‌లో జరుగుతోంది — అయితే ఇది కేవలం ఒక అంచనా మాత్రమే, ఖచ్చితమైన గణాంకం కాదు. దీనితో రాజమౌళి కేవలం ఒక సినిమాను రూపొందించడం లేదు, ఆయన ఒక అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టిస్తున్నారని నెటిజన్లు స్పందిస్తున్నారు.
 
About Writer
దేవీ
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
Tanikella Bharani: మినీ శంకరాభరణం తరహాగా పాటకు ప్రాణం చిత్రం ప్రారంభం