1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Mercury Rises By 5.1°C In Andhra Pradesh

ఏపీలో పెరిగిన పగటిపూట ఉష్ణోగ్రతలు- నిర్మానుష్యంగా విశాఖపట్నం బీచ్ రోడ్డు

Summer
ఆంధ్రప్రదేశ్‌లో పగటిపూట గరిష్ట ఉష్ణోగ్రత 5.1°డిగ్రీల మేర పెరిగింది. మంగళవారం భారత వాతావరణ శాఖ పర్యవేక్షించిన ప్రాంతాలలో బాపట్ల అత్యధికంగా 38.9°C ఉష్ణోగ్రతను నమోదు చేయడంతో పాటు, అత్యధిక పెరుగుదలను కూడా నమోదు చేసింది. 
 
ఒంగోలు, కావలి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 39.3°Cగా నమోదయ్యాయి. ఇక్కడ వరుసగా 4.3°C, 4.8°C పెరుగుదల కనిపించింది. నెల్లూరులో 39°C (4°C పెరుగుదల) నమోదు కాగా, విశాఖపట్నంలో 37.4°C (4.6°C పెరుగుదల) నమోదైంది. 
 
వేడి గాలుల ప్రభావంతో మధ్యాహ్న సమయంలో విశాఖపట్నం బీచ్ రోడ్డు నిర్మానుష్యంగా కనిపించింది. పొడి వాతావరణం, పశ్చిమ దిశగా వీచే గాలుల కారణంగా పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి. 
 
బంగాళాఖాతంలో ఏదైనా వాతావరణ వ్యవస్థ ఏర్పడే వరకు ఈ పరిస్థితులు మరికొన్ని రోజుల పాటు కొనసాగుతాయని అమరావతిలోని ఐఎండీ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎస్. కరుణాసాగర్ తెలిపారు.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
మరికావలస గిరిజన పాఠశాల తరలింపు.. చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు