1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
  4. Do Mosquitoes Favor Specific Blood Types?

దోమలకు ఏ బ్లడ్ గ్రూపంటే ఇష్టం.. ఆడదోమలే రక్తాన్ని తాగుతాయట.. మరి మగ దోమలు..?!

జికా వైరస్ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను భయంతో వణికిస్తున్న తరుణంలో దోమలు మనల్ని అసలెందుకు కుడుతాయో తెలుసుకుందాం. దోమలు మనల్ని ఎందుకు కుడతాయి. రక్తం మంటే వాటికెందుకు అంత ఇష్టం అనేదానికి కారణాలున

Do Mosquitoes Favor Specific Blood Types?
జికా వైరస్ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను భయంతో వణికిస్తున్న తరుణంలో దోమలు మనల్ని అసలెందుకు కుడుతాయో తెలుసుకుందాం. దోమలు మనల్ని ఎందుకు కుడతాయి. రక్తం మంటే వాటికెందుకు అంత ఇష్టం అనేదానికి కారణాలున్నాయి. 
 
చర్మం నుంచి వెలువడే రసాయనాలు అలాగే చర్మంపై ఉన్న బ్యాక్టీరియా అంటే దోమలకు చాలా ఇష్టమట. అందుకే పదే పదే దోమలు కుడుతుంటాయని శాస్త్రీయ పరమైన పరిశోధనలు వెల్లడించాయి. దోమలు కార్బన్‌డయాక్సైడ్‌ను 160 మీటర్లదూరంలో ఉన్నా పసిగడతాయి. అందుకే మనం నిద్రపోతున్న సమయంలో మనచుట్టూ అవి తిరుగుతూ కుడుతూ రక్తాన్ని తీసుకుంటాయని పరిశోధనలు తెలిపాయి.
 
అంతేగాకుండా గర్భిణీలను దోమలు కుట్టేందుకు ఇష్టపడతాయట. సాధారణ మహిళలకంటే గర్భిణులు 28 వారాల సమయంలో విడిచే శ్వాసలో 21 శాతం కంటే ఎక్కువ కార్బన్‌డయాక్సైడ్‌ ఉంటుంది. అందుకే దోమలు గర్భిణుల్ని కుడతాయని పరిశోధనల్లో తేలింది. అలాగే శారీరకంగా శ్రమించినప్పుడు లాక్టిక్‌ఆమ్లం, యూరిక్‌ ఆమ్లం, అమ్మోనియా వంటి రసాయనాలు మన చర్మం నుంచి విడుదలవుతాయి. అందుకే చెమటపట్టిన దేహాల్ని దోమలు కుట్టడానికి తెగ ఇష్టపడతాయని పరిశోధకులు చెప్తున్నారు. 
 
ఇకపోతే.. దోమలకు కూడా ఇష్టమైన బ్లడ్ గ్రూపులున్నాయని గతంలో ఎన్నో పరిశోధనలు తేల్చాయి. అలాంటి వాటిల్లో ఎ, బి రక్తగ్రూపులతో పోలిస్తే ఓ గ్రూప్‌ రక్తాన్ని దోమలు రెండురెట్లు అధికంగా ఇష్టపడతాయట. మగదోమలు పువ్వులు, తేనెపై ఆధారపడితే ఆడదోమలు మాత్రం మనుషుల రక్తాన్ని తాగటానికి ఇష్టపడతాయి.
తర్వాతి కథనం
అంద‌మైన చ‌ర్మం కోసం లావెండర్ ఆయిల్....