1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
  4. Eating habbits, health tips

భోజనానికి ఎంత సమయం కేటాయిస్తున్నారు...? 5 నిమిషాల్లో అయిపోతుందా?

అన్నం తినేటపుడు కూడా ఇప్పుడు టెన్షన్ మామూలైపోయింది. గబగబా నాలుగు ముద్దలు లాగించేసి వెళ్లిపోయేవారు చాలామంది ఉన్నారు. ఇలా తినేవారికి ఆరోగ్య సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పని ఒత్తిడిలో భోజనాన్ని, ఏదో అయిందిలే అన్నట్లు కాకుండా.. నెమ్

Eating habbits
అన్నం తినేటపుడు కూడా ఇప్పుడు టెన్షన్ మామూలైపోయింది. గబగబా నాలుగు ముద్దలు లాగించేసి వెళ్లిపోయేవారు చాలామంది ఉన్నారు. ఇలా తినేవారికి ఆరోగ్య సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పని ఒత్తిడిలో భోజనాన్ని, ఏదో అయిందిలే అన్నట్లు కాకుండా.. నెమ్మదిగా, సరైనా సమయానికి తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినవారవుతారు. 
 
ఒక వేళ అల్పాహారం తీసుకోవడం కుదరకుంటే, రకరకాల పండ్లు, శాండ్ విచ్ వంటివి తీసుకోవచ్చు. కడుపును ఏ మాత్రం ఖాళీగా ఉంచకుండా బాదం పప్పులు వంటివి తింటే తక్షణ శక్తి అందుతుంది. అలాగే నాలుగు ముద్దలు గబగబా లాగించేసి మధ్యాహ్న భోజనం అయిపించకండి. వేగంగా తింటే జీర్ణక్రియలు దెబ్బతింటాయి. సరిగ్గా నమలకపోవడం వల్ల ఆహారం త్వరగా జీర్ణం కాదు. తద్వారా పోషకాలు కూడా సమయానికి అందవు. 
 
వేగంగా తినేస్తే, ఆపై శరీరంపై ఒత్తిడి పడుతుంది. భోజనానికి కనీసం 20 నిమిషాలు కేటాయిస్తే మంచిది. ఇదే సమయంలో అటు ఎక్కువ, ఇటు తక్కువ కాకుండా ఆహారం తీసుకోవాలి. ఏది అందుబాటులో ఉంటే దాన్ని తింటే, షుగర్, స్థూలకాయం సమస్యలు పెరుగుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
About Writer
chj
తర్వాతి కథనం
భార్యాభర్తల మధ్య శృంగారం ఎలా ఉండాలంటే...?