1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
  4. Hair dye could cause cancer

జుట్టుకు రంగు వేస్తున్నారా.. అయితే చర్మ క్యాన్సర్ ఖాయం...

ప్రస్తుతం చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ఫ్యాషన్ మోజులో జోగుతూ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఒకప్పుడు ముఖానికి మాత్రమే పరిమితమైన అందం అనే అంశం నేడు కొత్త పుంతులు తొక్కుతోంది.

Hair dye
ప్రస్తుతం చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ఫ్యాషన్ మోజులో జోగుతూ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఒకప్పుడు ముఖానికి మాత్రమే పరిమితమైన అందం అనే అంశం నేడు కొత్త పుంతులు తొక్కుతోంది. మారుతున్న అభిరుచులు, అలవాట్లతో ప్రపంచం రంగులు పులుముకుంటోంది. జుట్టుకు వేసుకునే రంగు దగ్గర్నుంచి కాళ్ల గోళ్లకు వేసుకునే రంగుల దాకా అన్నీ ఫ్యాషన్‌కు తగ్గట్టుగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. 
 
అయితే ఫ్యాషన్‌పై యువత పెంచుకున్న మోజు వారిని కొత్త సమస్యల్లోకి నెట్టేస్తోంది. ముఖ్యంగా.. జట్టుకు రంగులేసుకోవడం ఇపుడు కామన్‌గా మారిపోయింది. ఈ రంగులు వేసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యల బారినపడుతున్నట్టు సమాచారం. ముఖ్యంగా.. పలువురు తమ వయసును కప్పిపుచ్చుకోవడం కోసం జుట్టుకు రంగులేస్తుంటారు. 
 
ముఖాన్ని మేకప్‌తో కవర్ చేస్తుంటారు. అయితే వీరు చేస్తున్న ఈ రెండు పనుల వల్ల క్యాన్సర్‌ను కొనితెచ్చుకుంటున్నారు. జుట్టుకు వేసే రంగుల్లో, ముఖానికి పూసుకునే క్రీముల్లో ఎన్నో ప్రమాదకరమైన రసాయనాలు ఉంటాయి. దీనివల్ల కాలక్రమేణా జుట్టు రాలిపోవడమే కాకుండా, చర్మ క్యాన్సర్ వచ్చే అవకాశాలున్నాయి. అందుకే వీటి వాడకం ఎంత తగ్గిస్తే అంత మంచిదని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు. 
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
హెపటైటిస్ బి వ్యాధి చాలా డేంజర్... తెలుసుకోవడం చాలా ముఖ్యం... వివరంగా...