1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
  4. home remedies for cold

అలాంటి సూప్ తాగితే జలుబు తగ్గుతుంది...

home remedies
వారానికి ఒకసారయినా కాకరకాయను ఆహారంలో చేర్చుకుంటే మంచిది.
 
కనీసం ఏడు-ఎనిమిది వారాలకు ఒకసారైనా ఒంటికి పసుపు రాసుకొని స్నానం చేస్తే చర్మ సంబంధ వ్యాధులు రావు. క్రమేణా చర్మం మీద ఉండే అన్‌వాంటెడ్ హెయిర్‌ రాలిపోతుంది. నువ్వుల నూనెలో పసుపు కలిపి ఒంటికి పట్టించాలి.
 
కళ్ళకలక వచ్చినప్పుడు దూదిని ధనియాలు నానేసిన నీటిలో ముంచి కళ్ళను తుడిస్తే ఉపశమనంగా పనిచేస్తుంది. 
 
కాలిన మచ్చలకు తేనె రాస్తే కాలిన మచ్చలు పోతాయి. 
 
కాళ్ళు చేతులు బెణికి నట్లయితే ఉప్పుతో కాపడం పెడితే తగ్గుతుంది. 
 
కొద్దిగా చింతపండు గుజ్జు, టమాటారసం, మిరియాల పొడి, ఒక మిరపకాయ, కాస్త ఉప్పులతో తయారు చేసిన సూప్‌ని వేడిగా తాగితే జలుబు, ముక్కు కారటం తగ్గుతాయి. 
 
కాస్త దాల్చిన చెక్క పొడి, ఒక టేబుల్ స్పూను తేనె, కొంచెం మిరియాల పొడి, రెండు చుక్కల నిమ్మరసం ఇవన్నీ కలిపి తీసుకుంటే సాధారణ జలుబు తగ్గుతుంది.
About Writer
సిహెచ్
తర్వాతి కథనం
కరోనా వైరస్ కలకలం : ఎలా వ్యాపిస్తుంది.. దాని లక్షణాలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు