ఆదివారం, 5 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 4 జనవరి 2020 (20:59 IST)

వేడి నీళ్లలో నిమ్మరసం, కాస్త తేనె కలుపుకొని తీసుకుంటే?

జలుబు అంటుకోగానే ఒళ్లు నొప్పులు, గొంతు, తల నొప్పి, జలుబు, జ్వరం... ఈ లక్షణాలన్నీ ఒకేసారి కనిపిస్తాయి. కొందరికి ఒకటే తుమ్ములు, మరికొందరికి దగ్గు కనిపిస్తుంది. పెద్దవాళ్లయితే ఏదో విధంగా తట్టుకుంటారు కాని పిల్లలు నీరసించిపోతారు. ఒకరి నుంచి ఒకరికి వెంటనే వ్యాపించే ఈ జలుబు, దగ్గు, గొంతు ఇన్‌ఫెక్షన్ సమస్యలకు కొన్ని నివారణ సూచనలు.
 
1. జలుబు పూర్తిగా దారికి వచ్చే వరకు రోజుకు మూడు సార్లు వేడి నీళ్లలో ఉప్పు వేసుకొని పుక్కిలించడం మరచిపోవద్దు.
 
2. రోజుకు రెండు సార్లు విక్స్ లేదా పసుపు వేసుకొని ఆవిరి పడితే జలుబు త్వరగా తగ్గడంతో పాటు గొప్ప రిలీఫ్ వస్తుంది.
 
3. జలుబు, జ్వరం తగ్గేవరకు పండ్లు, పండ్ల రసాలకు దూరంగా ఉండండి.
 
4. నిమ్మపండు ఈ సీజన్‌లో వచ్చే జలుబు లక్షణాలను త్వరగా తగ్గిస్తుంది. వేడి నీళ్లలో నిమ్మరసం, కాస్త తేనె కలుపుకొని రోజుకు రెండుసార్లు తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జబ్బు నుంచి త్వరగా ఉపసమనం పొందుతారు.
 
5. మిరియాలు, వెల్లుల్లి, అల్లం.. ఇవన్నీ కూడా ముక్కు దిబ్బడను తగ్గించడంతో పాటు, జలుబు చేసిన సమయంలో రిలీఫ్‌గా ఉండేందుకు తోడ్పడతాయి.