సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 18 నవంబరు 2019 (19:04 IST)

ఆ నూనెను చేతి రుమాలులో వేసుకుని నాలుగు చుక్కలు పీల్చితే?

కొబ్బరినూనెలో జాజి తైలాన్ని కలిసి రాస్తుంటే తల్లో పేలుండే వారికి ఇలాంటి ఇబ్బంది ఉండదు. చెంచా పాలమీగడలో నాలుగు చుక్కలు చేర్చి మర్దన చేస్తే ముఖం మీద మచ్చలు తగ్గుముఖం పడతాయి. ఇంకా మానసిక ఒత్తిడి, ఆందోళనలో ఉన్నవారు జాజినూనెను వాడితే మంచి ఫలితం ఉంటుంది. ఒంటి నొప్పులతో బాధపడేవారు కొబ్బరి నూనెతో కలిపి రాసుకుంటే నొప్పులు తగ్గిపోతాయి. 
 
ఇదేవిధంగా కప్పు నీళ్లలో ఆరుచుక్కల నీలగిరి నూనెను కలిపి పుక్కిలిస్తే నోటిపూత, ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు బాధించవు. జ్వరంతో బాధపడేవారికి చల్లటి నీళ్లలో ఆరు నుంచి పది చుక్కల నీలగరితైలం వేసి ఒంటిని తడిపితే జ్వరం త్వరగా తగ్గుతుంది. 
 
జలుబు, దగ్గు, సైనస్ వల్ల వచ్చే తలనొప్పి బాధిస్తుంటే చేతి రుమాలులో నాలుగు చుక్కలు వేసి పీల్చితే ఉపశమనం లభిస్తుంది. చిన్నపిల్లలకు కఫం పెరిగి గురక పెడుతుంటే ఆరు నుంచి పది చుక్కలు నీళ్లలో వేసి పీల్చేలా చూడాలి.