మంగళవారం, 7 ఏప్రియల్ 2026
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : శనివారం, 10 సెప్టెంబరు 2016 (12:21 IST)

రాత్రిపూట నిద్రించే ముందు చల్లటి పాలలో తేనె కలుపుకుని తాగితే?

భోజనంతో పాటు రెండు మూడు చెంచాల తేనే తీసుకుంటే నిస్సత్తువ తొలగిపోతుంది. శారీరకంగా బలహీనంగా ఉన్నవారు ఇలా చేస్తే శరీరానికి బలం చేకూర్చినట్లవుతుంది. అలాగే రాత్రిపూట పడుకునే ముందు చల్లటి పాలలో తేనె కలుపుకు

భోజనంతో పాటు రెండు మూడు చెంచాల తేనే తీసుకుంటే నిస్సత్తువ తొలగిపోతుంది. శారీరకంగా బలహీనంగా ఉన్నవారు ఇలా చేస్తే శరీరానికి బలం చేకూర్చినట్లవుతుంది. అలాగే రాత్రిపూట పడుకునే ముందు చల్లటి పాలలో తేనె కలుపుకుని త్రాగండి. దీంతో శరీరం పుష్టిగా మారుతుందంటున్నారు వైద్యులు.  
 
అలసట: శారీరకంగా అలసట చెందినప్పుడు చల్లటి నీటిలో రెండు చెంచాల తేనె కలుపుకుని త్రాగండి. దీంతో శరీరంలో నూతనోత్తేజం ఉప్పొంగి వస్తుంది. 
 
అజీర్తి: ఆహారం జీర్ణం కానప్పుడు పాలాకును ఆహారంగా తీసుకోండి లేదా టమోటా రసం త్రాగండి. 
 
అరికాళ్ళల్లో మంటగా ఉంటే : అరికాళ్ళల్లో మంటగా ఉంటే సొరకాయను ముక్కలుగా కోసుకుని కాళ్ళపై ఉంచుకోండి. దీంతో అరికాళ్ళల్లో మంట తగ్గి ఉపశమనం కలుగుతుంది.