తిరుమలలో స్వైన్ ఫ్లూ వార్డు... టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు
తిరుమలకు దేశ విదేశాల నుంచి తిరుమలకు చేరే భక్తులు వేలాది సంఖ్యలో ఉన్నారు. స్వైన్ ఫ్లూ విస్తరిస్తున్న పరిస్థితులలో రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే భక్తుల ద్వారా తిరుమలలో స్వైన్ ప్రబలే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దీంతో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి సాంబశివరావు తెలిపారు. ప్రత్యేకమైన వార్డును కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. గురువారం తిరుమలలో ఏర్పాటు చేసిన విలేకరు సమావేశంలో ఆయన మాట్లాడుతూ, భక్తుల కోసం తిరుమల అశ్వనీ ఆసుపత్రిలో గదిని ఏర్పాటు చేసినట్లు వివరించారు.
టామీ యాంటీ వైరల్ కాప్సుల్స్, ఎన్ 95 మాస్కులను సిద్ధంగా ఉంచినట్లు వివరించారు. వీటిని తిరుమలలో అశ్వనీ ఆసుపత్రి ద్వారా ఉచితంగా పంపిణీ చేస్తామని వివరించారు. జలుబు, దగ్గు కలిగి తిరుమలకు శ్రీవారి మెట్టు, అలిపిరి ద్వారా వచ్చే భక్తులకు వీటిని దారిలోనే పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. శుక్రవారం నుంచి ఈ పంపిణీ చేపడుతారని స్వైన్ ఫ్లూనకు సంబంధించిన ప్లెక్సీలను తిరుమలలోని ప్రముఖ ప్రదేశాలలో ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో జేఈవో శ్రీనివాసరాజు, సిఎంఓ డాక్టర్ ఎన్ వికాస్ తదితరులు పాల్గొన్నారు.

