గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By pyr
Last Updated : బుధవారం, 9 సెప్టెంబరు 2015 (19:48 IST)

తిరుమల వెంకన్న పాలనలోకి ఒంటిమిట్ట కోదండ రామన్న

సీమ భద్రాద్రి రాముడుగా పేరుమోసిన కోదండ రాముడు తిరుమల వెంకన్న ఏలుబడిలోకి వచ్చేశాడు.  బుధవారం ఉదయం ఆలయాన్ని టీటీడీలో విలీనం చేసే పత్రాలను ఆలయ ఈవో తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తికి అప్పగించారు. ఈ కార్యక్రమం ఒంటిమిట్టలో జరిగింది. ఈ ఆలయం ఖమ్మంలోని భద్రాచల రామాలయం అంతటి పేరు ప్రఖ్యాతలు సాధించడం ఖాయమని ఆయన అన్నారు. 
 
విజయనగర సామ్రాజ్య కట్టడాలకు నిదర్శనమైన 16వ శతాబ్దం నాటి ఈ కోదండ రామాలయం తిరుమల తిరుపతి దేవస్థాన పరిధిలోకి రావడం విశేషమని అన్నారు. బమ్మెర పోతన, తాళ్ళపాక అన్నమాచార్యులు పుట్టిన కడప జిల్లాకు ఇక శోభ సంతరించుకుంటుందని ఆయన అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఈ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ఆయనతోపాటు టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, డాక్టర్ హరిప్రసాద్‌లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.