1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
  4. best home remedies cure irregular periods

ద్రాక్షా పళ్లతో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కట్టడి

best home remedies cure irregular periods
మహిళల్లో చోటు చేసుకునే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సమస్యను ద్రాక్షా పళ్లతో కట్టడి చేయవచ్చును. సాధారణంగా మహిళల్లో ప్రతి నెల పీరియడ్స్ ఒకే తేదీలో రావాల్సి ఉంది. 28 రోజుల నుంచి 31 రోజుల్లో రావచ్చు. అయితే కొందరు మహిళల్లో కొన్ని రోజులు ఆలస్యం కావడం, లేద రెండు, మూడు నెలలకొకసారి కావడం జరుగుతుంటుంది. ఇటువంటి వాటిని ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటారు.
 
ఈ విధమైన ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వల్ల తొలుత మహిళల్లో ఏర్పడేది గర్భధారణ సమస్య. అపక్రమ రుతుక్రమం వల్ల పిల్లలు పుట్టరు. ఇంతేకాక ఊబకాయం వంటి పలు సమస్యలు ఎదురవుతాయి. వీటికి ముఖ్య కారణం హార్మోన్‌ల అసమతుల్యమే అని వైద్యులు తెలుపుతుంటారు. ఈ సమస్యను ఎదుర్కునే మహిళలు ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటే ఆహారపదార్థాలు తీసుకోవాలి.
 
ద్రాక్షా పళ్లలో ఐరన్ శక్తి అమితంగా ఉంటుంది. కనుక ప్రతి రోజూ ద్రాక్షాలను తింటే రుతుక్రమాన్ని క్రమబద్దం చేయడమేకాకుండా, రక్తహీనత లేకుండా కాపాడుతుంది. ఇదేవిధంగా ఖర్జూరంను పాలతో కలిపి తీసుకోవడం వల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ను తక్షణ ఉపశమనం పొందవచ్చు. అంతే కాదు, ఇందులో న్యూట్రీషియన్స్ కూడా ఎక్కువగా ఉండటం వల్ల ఇది పీరియడ్స్ లోపాలను తగ్గించడానికి బాగా పనిచేస్తుంది.
About Writer
CVR