సంబంధిత వార్తలు
- టీఎస్ పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ కేసు : 13 మంది శాశ్వతంగా డీబార్
- జాంబియాలో కలరా వ్యాప్తి: ఆస్పత్రిగా మారిన స్టేడియం.. 400మంది మృతి
- వందశాతం ప్రజల్ని మింగేసే కరోనా జిఎక్స్-పిఎస్వి.. చైనా నుంచి..?
- ఇరాన్ తన గగనతల దాడులపై స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన పాకిస్థాన్
- భారతీయ విద్యార్థులకు స్టడీ పర్మిట్లు ఇక పెరిగే ఛాన్స్ లేదు.. కెనడా మంత్రి
చైనా స్కూలులో మంటలు.. 13మంది సజీవ దహనం
చైనాలోని హెనాన్ ప్రావిన్స్ స్కూలుకు చెందిన వసతి గృహంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 13మంది విద్యార్థులు సజీవ దహనం అయ్యారు. ఈ ఘటన శుక్రవారం అర్థరాత్రి చోటుచేసుకుంది. యన్షాన్పు గ్రామంలోని యింగ్‌కై స్కూల్‌లో ఈ ఘోరం చోటుచేసుకుంది.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్కూలుకు చేరుకుని మంటల్ని అదుపులోకి తీసుకున్నారు.
మంటల్లో చిక్కుకున్న 13 మంది విద్యార్థులు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
