శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 17 జనవరి 2024 (12:49 IST)

ఇరాన్ తన గగనతల దాడులపై స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన పాకిస్థాన్

pakistan flag
ఇరాన్ తన గగనతల ఒప్పందాన్ని ఉల్లంఘించడాన్ని పాకిస్తాన్ తీవ్రంగా ఖండించింది. ఇంకా ఇలాంటివి పునరావృతమైతే 'తీవ్ర పరిణామాలు' తప్పవని హెచ్చరించింది. మిలిటెంట్ స్థావరాలపై దాడుల తర్వాత ఇరాన్ తన గగనతలాన్ని ఉల్లంఘించడాన్ని పాకిస్తాన్ తీవ్రంగా ఖండించింది 
 
జైష్ అల్-అద్ల్ ఉగ్రవాద సంస్థకు చెందిన రెండు స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు టెహ్రాన్ పేర్కొన్న సమయంలో ఇరాన్ "తన గగనతల ఉల్లంఘన"పై పాకిస్థాన్ బుధవారం తీవ్ర పదజాలంతో పాకిస్థాన్ ఖండించింది. ఇటువంటి చర్యలు "తీవ్ర పరిణామాలను" కలిగిస్తాయని పొరుగు దేశాన్ని కూడా హెచ్చరించింది. 
 
ఇరాన్ మంగళవారం పాకిస్తాన్‌లో దాడులను ప్రారంభించింది. ఇది తీవ్రవాద సంస్థకు స్థావరాలుగా అభివర్ణించింది. గాజా స్ట్రిప్‌లోని హమాస్‌పై ఇజ్రాయెల్ చేసిన యుద్ధం వల్ల ఇప్పటికే మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉంది.
 
ఇరాక్ - సిరియాలో ఇరాన్ దాడులు చేసిన ఒక రోజు తర్వాత ఈ దాడి జరిగింది. ఇరాన్ దాడిలో ఇద్దరు చిన్నారులు చనిపోయారని, మరో ముగ్గురు బాలికలు తీవ్రంగా గాయపడ్డారని చెబుతూ పాకిస్థాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.