శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 18 జనవరి 2024 (11:00 IST)

వందశాతం ప్రజల్ని మింగేసే కరోనా జిఎక్స్-పిఎస్‌వి.. చైనా నుంచి..?

corona visus
ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా నుంచి ఇప్పుడిప్పుడే ప్రజలు కోలుకుంటున్నారు. తాజాగా కొత్త వైరస్ పుట్టుకొచ్చింది. ప్రజలను వందశాతం మింగేసే కొత్త వైరస్‌పై చైనా పరిశోధన చేస్తున్నట్లు షాకింగ్ వార్తలు బయటికి వచ్చాయి. 
 
2019వ సంవత్సరం చివరిన చైనాలో వూహాన్ ప్రావిన్స్‌ నుంచి కరోనా పుట్టుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ కరోనాతో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఇబ్బంది పడ్డారు. లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందుకోసం టీకాలు వచ్చాయి. 
 
క్వారంటైన్‌‌తో కరోనా నుంచి చాలామంది కోలుకున్నారు. ఈ కోవిడ్ నుంచి ప్రపంచ ప్రజలు కోలుకుంటున్నారు. కొత్త కొత్త వేరియంట్‌లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా జిఎక్స్-పిఎస్‌వి అనే వైరస్‌ను పరిశోధకులు కనుగొన్నారు.
 
కరోనా ఫ్యామిలీకి చెందిన ఈ వైరస్ వందశాతం ప్రజలను మింగేసేటువంటి ప్రమాదకరమైందని చెప్పబడుతోంది. ఈ వైర‌స్‌‌ను చైనా పరిశోధకులు కొన్ని ఎలుక‌ల‌పై ప‌రిశోధించినట్లు తెలుస్తోంది. ఈ పరీక్ష విజ‌య‌వంతమైనట్లు సమాచారం. 
 
కరోనా వైరస్ చైనా పరిశోధనా కేంద్రం నుంచే పుట్టుకొచ్చిందని ప్రపంచ దేశాలు ఆరోపిస్తున్న వేళ.. డ్రాగన్ కంట్రీ ఎలాంటి క్లారిటీ ఇవ్వని పరిస్థితుల్లో చైనా కొత్త వైరస్‌ను కనుగొనే పనిలో పడటంపై మళ్లీ చర్చ మొదలైంది.