సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 21 డిశెంబరు 2023 (08:42 IST)

పెరుగుతున్న కొత్త వేరియంట్ జేఎన్1 కేసులు

Covid test
తెలంగాణ రాష్ట్రంలో కొత్త కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. జీఎన్1 అనే కొత్త వేరియంట్ కేసులు పెరుగుతున్నాయని, బుధవారం కొత్తగా ఆరు పాజిటివ్ కేసులు నమోదైనట్టు వైద్య ఆరోగ్య శాఖ  వెల్లడించింది. ఈ కొత్త కేసులతో కలుపుకుని రాష్ట్రంలో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 14గా ఉన్నట్టు పేర్కొంది. ఈ కొత్త కేసులన్నీ హైదరాబాద్ నగరంలోనే ఉన్నట్టు వైద్య శాఖ తెలిపింది. అయితే, ఈ కొత్త వేరియంట్ కేసులు ఒక్క తెలంగాణాలోనే కాకుండా దేశీయంగా కూడా పెరుగుతున్నాయి. 
 
వైద్య శాఖ వివరాల మేరకు.. కరోనా కొత్త వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. బుధవారం ఒక్కరోజే ఆరు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి సంఖ్య 14కు చేరింది. కొత్తగా నమోదైన కేసులన్ని హైదరాబాద్ నగరంలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు, అధికారులు సూచిస్తున్నారు. తెలంగాణాలో ఆరు కొత్త కేసులు నమోదు కాగా, ఒకరు కోలుకున్నారని, ప్రస్తుతం ఈ వైరస్ బారినపడినవారిలో కోలుకునే శాతం 99.51 శాతంగా ఉందని తెలిపింది. 
 
కారులో గ్యాస్ లీక్... షికాగోలో ప్రాణాలు కోల్పోయిన తెలుగు అమ్మాయి 
 
అమెరికాలో తెలుగు యువతి ఒకరు ప్రాణాలు కోల్పోయారు. కారులో గ్యాస్ లీక్ కావడంతో ఆమె చనిపోయింది. ఈ విషాదకర ఘటన షికాగోలో జరిగింది. బుధవారం కారులో ప్రయాణిస్తుండగా, ఈ ఘటన జరిగింది. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఈ యువతి ప్రయాణిస్తున్న కారులో గ్యాస్ లీక్ కావడంతో ప్రాణాలు కోల్పోయింది. 
 
విజయవాడ గ్రామీణం ప్రసాదంపాడు ప్రాంతానికి చెందిన షేక్ జహీరా నాజ్ (22) స్థానికంగా ఫిజియోథెరపీలో డిగ్రీ చేశారు. ఈ యేడాది ఆగస్టులో ఎంఎస్ చేసేందుకు అమెరికాకు వెళ్లారు. బుధవారం షికాగో నగరంలో ఆమె ప్రయాణిస్తున్న కారులో గ్యాస్ లీక్ అయింది. 
 
దీంతో డ్రైవర్‌తో పాటు నాజ్ కూడా స్పృహ కోల్పోయారు. ఆ వెంటనే వారిని ఆస్పత్రికి తరలించగా, జహీరా అప్పటికే చనిపోయినట్టు వైద్యులు ప్రకటించారు. ఈ విషయం తెలిసిన ఆమె కుటుంబ సభ్యులు బోరున విలపిస్తూ, తమ కుమార్తె మృతదేహం స్వదేశానికి తీసుకొచ్చేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ప్రాధేయపడుతున్నారు.