సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 20 డిశెంబరు 2023 (13:40 IST)

తెలంగాణ రాష్ట్ర అప్పు రూ.6,71,757 అప్పు : భట్టి విక్రమార్క

batti
తెలంగాణ రాష్ట్ర అప్పు రూ.6,71,757గా ఉందని ఆ రాష్ట్ర ఆర్థిక శాఖామంత్రి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. 2014లో రూ.72,658 కోట్ల అప్పులో ఉన్న రాష్ట్ర ఇపుడు రూ.6.71 లభల కోట్లకు చేరిందని ఆయన వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్ శ్వేతపత్రాన్ని బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అప్పట్లో ఖజానాలో వంద రోజులకు సరిపడా సొమ్ము ఉండేదని ఆయన గుర్తుచేరింది. 
 
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన కొత్తలో తెలంగాణ అప్పు రూ.72,658 కోట్లు ఉండేదని.. బీఆర్ఎస్ తొమ్మిదిన్నరేండ్ల పాలనలో ఇది దాదాపు రూ.7 లక్షల కోట్లకు చేరుకుందని విమర్శించారు. గత ప్రభుత్వం తెలంగాణను అప్పుల కుప్పగా మార్చేసిందని మండిపడ్డారు. 2014 లో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో 100 రోజుల ఖర్చులకు సరిపడా సొమ్ము ఉండేదని భట్టి వివరించారు. 
 
ప్రస్తుతం ఇది పది రోజులకు తగ్గిపోయిందని, గత ప్రభుత్వం అవలంభించిన ఆర్థిక విధానాలే దీనికి కారణమన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైందని, రోజు ఖర్చులకూ రిజర్వ్ బ్యాంకు పై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొందని చెప్పారు.
 
గత ప్రభుత్వ హయాంలో బడ్జెట్‌కు వాస్తవ వ్యయానికి 20 శాతం తేడా ఉందన్నారు. బడ్జెటేతర ఖర్చు విపరీతంగా పెరిగిందని ఆరోపించారు. విద్య, వైద్య రంగాలలో సరిపడా నిధులను ఖర్చు చేయలేదని చెప్పారు. ఖర్చు చేసిన నిధులకు అనుగుణంగా ఆస్తుల సృష్టి జరగలేదని వివరించారు. 
 
ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో వడ్డీ (తీసుకున్న రుణాలకు) భారం 34 శాతానికి పెరిగిందని తెలిపారు. మరో 35 శాతం ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకు ఖర్చు చేయాల్సి వస్తోందన్నారు. 2014లో మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రం ప్రస్తుతం అప్పుల ఊబిలో కూరుకుపోవడానికి బడ్జెటేతర రుణాలే కారణమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో వెల్లడించారు.