1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 1 జూన్ 2023 (09:36 IST)

టీఎస్ పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ కేసు : 13 మంది శాశ్వతంగా డీబార్

tspsc logo
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్సీ) ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం సంచలనంగా మారిన విషయం తెల్సిందే. ఈ ప్రశ్నపత్రం లీకేజీతో సంబంధం ఉన్న 13 మందిని శాశ్వతంగా డీబార్ చేశారు. భవిష్యత్‌లో వీరు ఎలాంటి పరీక్షలకు హాజరుకాకుండా ఉండేందుకు, ఉద్యోగాలు పొందకుండా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ మేరకు శాశ్వతంగా డీబార్ చేసిన వారి పేర్లతో కూడిన జాబితాను టీఎస్ పీఎస్సీ కార్యదర్శి విడుదల చేశారు. ఈ 13 మందితో కలిసి ఇప్పటివరకు డీబార్ అయిన వారి సంఖ్య 50కి చేరింది. 
 
భవిష్యత్‌తో టీఎస్ పీఎస్సీ నిర్వహించే ఏ పరీక్షలకు వీరు హాజరుకాకుండా, ఉద్యోగాలు పొందకుండా చర్యలు తీసుకుంది. ఈ జాబితాను టీఎస్ పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ విడుదల చేశారు. ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో ప్రమేయం ఉన్న 37 మందిని మంగళవారం శాశ్వతంగా డీబార్ చేయగా, తాజాగా మరో 13 మందిని డీబార్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.