శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్

గ్రేటర్ హైదరాబాద్ నగర పరిధిలో భారీగా అంగన్‌వాడీ పోస్టులు

harish rao
గ్రేటర్ హైదరాబాద్ నగరం పరిధిలో భారీగా అంగన్‌వాడీ పోస్టులను భర్తీ చేయనున్నట్టు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు వెల్లడించారు. జీహెచ్ఎంసీ పరిధిలో అనేక పోస్టులు ఖాళీగా ఉన్నాయని వాటి భర్తీకి ఈ నెలలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపారు. 
 
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ముంగింపు రోజైన ఆదివారం ఆయన మాట్లాడుతూ, జీహెచ్ఎంసీ పరిధిలో 1500 ఆశా వర్కర్ పోస్టులను భర్తీ చేయనున్నట్టు తెలిపారు. ఇందుకోసం నెలాఖరులోగా నోటిఫికేషన్ జారీ చేస్తామని తెలిపారు. 
 
అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. అదేవిధంగా జీహెచ్ఎంసీ పరిధిలోని బస్తీల సుస్తీ పోగొట్టేందుకు బస్తీ దావఖానాలను సీఎం కేసీఆర్ ప్రారంభించారని మంత్రి హరీశ్ గుర్తు చేశారు. ఈ బస్తీ దావఖానాల్లో ప్రస్తుతం 57 రకాల వైద్య పరీక్షలు చేస్తున్నామని, త్వరలోనే ఈ పరీక్షల సంఖ్యను 134కు పెంచుతామని తెలిపారు. 
 
అలాగే, చికిత్సలో భాగంగా రోగులకు 158 రకాల మందులను అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. బస్తీ దావఖానాల వల్ల పెద్దాసుపత్రుల్లో ఔట్ పేషంట్ల రద్దీ తగ్గిందని మంత్రి వెల్లడించారు. ఈ బస్తీ దావఖానాల్లో ఇప్పటివరకు కోటి మందికి పైగా బస్తీవాసులు వైద్య సేవలు పొందారని ఆయన తెలిపారు.