ఆదివారం, 24 సెప్టెంబరు 2023
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 10 ఫిబ్రవరి 2023 (19:53 IST)

ఈ నెల 13న శ్రీవారి ప్రత్యేక దర్శన టిక్కెట్లు విడుదల

venkateswara swamy
కలియుగ వైకుంఠంగా భావించే తిరుమల పుణ్యక్షేత్రంలో కొలువైవున్న శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శన ప్రత్యేక టిక్కెట్లను ఈ నెల 13వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) అధికారులు వెల్లడించారు. ఈ నెల 22వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ప్రత్యేక దర్శనాలకు సంబంధించి ఈ టిక్కెట్లను విడుదల చేయనుంది. ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో ఉంచుతామని తితిదే వెల్లడించింది. తిరుమల శ్రీవారి సన్నిధిలో బాలాలయం వాయిదాపడటంతో ఈ మేరకు ప్రత్యేక దర్శన టిక్కెట్లను విడుదల చేస్తున్నట్టు తెలిపింది. 
 
అలాగే, అంగప్రదక్షిణ టిక్కెట్లను తితిదే రేపు విడుదల చేనుంది. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 31వ వరకు వర్తించే ఈ టిక్కెట్లను ఈ నెల 11వ తేదీ ఉదయం 11 నుంచి ఆన్‌లైన్‌లో ఉంచుతారు. వీటిని https://tirupatibalaji.ap.gov.in/ వెబ్ సైట్ లో కానీ, TT Devasthanams యాప్ ద్వారా కానీ ఈ టికెట్లను బుక్ చేసుకోవచ్చు.