సీఎం జగన్ సర్కారు అప్పుల చిట్టాను బహిర్గతం చేసిన కేంద్రం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పుల చిట్టాను కేంద్రం ప్రభుత్వం మంగళవారం బహిర్గతం చేసింది. ఏపీ సర్కారు ప్రతి యేటా రూ.45 వేల కోట్ల మేరకు అప్పులు చేస్తుందని తెలిపింది. గత 2019తో పోలిస్తే అప్పులు రెండింతలు పెరిగినట్టు వెల్లడించింది. ఈ మేరకు టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ యేటా సుమారు 45 వేల కోట్ల రూయాల అప్పులు చేస్తుందని పేర్కొన్నారు. బడ్జెట్ లెక్కల ప్రకారం ప్రస్తుతం ఏపీ అప్పులు రూ.4,42,442 కోట్లుగా ఉన్నాయని తెలిపింది. 2019లో ఇవి రూ.2,464,451 కోట్లుగా ఉండగా అది 2020లో రూ.3,07,671 కోట్లకు చేరుకుందని తెలిపింది.
2021లో రూ.3,53,021 కోట్ల నుంచి 2022లో సవరించిన అంచనాల మేరకు రూ.3,93,718 కోట్లకు చేరుకుందని తెలిపింది. అయితే, 2023 బడ్జెట్ అంచనాల మేరకు రూ.4,42,442 కోట్ల మేరకు అప్పులు ఉన్నాయని కేంద్రం వెల్లడించింది.