శనివారం, 12 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 31 జనవరి 2023 (15:30 IST)

మా ఫాదర్ నన్ను డాక్టర్ గా చూడాలనుకున్నారు : ప్రేమదేశం ప్రి రిలీజ్ లో మధుబాల

Madhubala, Srikanth Siddham,   Trigun and others
Madhubala, Srikanth Siddham, Trigun and others
"ప్రేమదేశం" పేరుతో చిత్రం రాబోతుంది. మణిశర్మ తన బ్యాగ్రౌండ్ స్కోర్ తోను సంగీతం అందించారు. సిరి క్రియేటివ్ వర్క్స్ పతాకంపై శ్రీకాంత్ సిద్ధమ్ దర్శకత్వం వహిస్తుండగా శిరీష సిద్ధమ్ నిర్మిస్తున్నారు. రఘు కళ్యాణ్ రెడ్డి, రాము లు అసోసియేట్ ప్రొడ్యూసర్స్ గా,కమల్, కిరణ్, రూపా, ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూసర్స్ గా వ్యవహారిస్తున్న ఈ చిత్రంలో అలనాటి అందాలతార మధుబాల ప్రత్యేక పాత్రలో నటిస్తుంది. త్రిగున్, మేఘా ఆకాష్, మాయ, అజయ్ కతుర్వార్, కమల్ నార్ల తేజ, శివ రామచంద్ర లు నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన “ప్రేమదేశం” చిత్రంలోని పాటలకు మరియు టీజర్ కు ప్రేక్షకులనుండి అద్భుత మైన రెస్పాన్స్ వస్తుంది. ఫిబ్రవరి 3 న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న సందర్బంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో ప్రి రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా జరుపుకుంది.
 
ఈ సందర్భంగా మధుబాల మాట్లాడుతూ.. నా చదువు అయిన తరువాత మా ఫాదర్ నన్ని డాక్టర్ గా చూడాలనుకున్నారు. అయితే అప్పుడు నేను నా ఫ్యూచర్ ఎలా ఉండాలో డిజైన్ చేసుకోలేదు. అయితే అప్పుడే నాకు "పూల్ ఔర్ కాంటే" సినిమా లో అవకాశం రావడం జరిగింది.ఆ తరువాత ఇంట్లో ఉన్న నాకు సినిమా వారు ఫోన్ చేసి సినిమా సూపర్ హిట్ అయ్యింది. మీరు బయటకు రండి అని చెప్పారు.ఆ తరువాత నుంచి నేను వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆ తరువాత కోవిడ్ సమయంలో డైరెక్టర్ శ్రీకాంత్ సిద్ధం ఈ "ప్రేమదేశం" సినిమా లైన్ చెప్పడంతో నచ్చి చేశాను.ఆ తరువాత టీజర్ రిలీజ్ చేసినప్పుడు నా ఫేస్ చూసుకొని చాలా బాగా చేశారు అనిపించింది. ఇందులో మణి శర్మ గారు ఇచ్చిన అద్భుతమైన మ్యూజిక్, పాటలు చాలా బాగున్నాయి. "ప్రేమదేశం" వంటి మంచి సినిమాలో నటిస్తున్నందుకు చాలా లక్కీ గా ఫీల్ అవుతున్నాను. ఫిబ్రవరి 3న వస్తున్న మా సినిమాలు అందరు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు. 
 
చిత్ర దర్శకుడు శ్రీకాంత్ సిద్ధం మాట్లాడుతూ, మొదట షార్ట్ ఫిలిం కాన్సెప్ట్ అనుకుని స్టార్ట్ చేసిన ఈ మూవీ ని పెద్ద మూవీగా ఎలా ముందుకు తీసుకెళ్లాలనే భయం ఉండేది. అయితే నా ఫ్రెండ్స్ అందరు నాకు ధైర్యం ఇచ్చి నువ్వు చెయ్యి మేము సపోర్ట్ చేస్తామన్నారు.ఆలా స్టార్ట్ అయిన ఈ మూవీ ఎంతో కష్టపడి కంప్లీట్ చేయగలిగాం. మా సినిమా, ట్రైలర్, టీజర్, పాటలకు ప్రేక్షకులనుండి వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే చాలా సంతోషం వేసింది. నేను ముఖ్యంగా మణిశర్మ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి.  ఇందులో మధుబాల నటిస్తుండడంతో మా సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది. ఫిబ్రవరి 3 న వస్తున్న మా "ప్రేమదేశం" సినిమాను అందరికీ తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నాను అన్నారు.
 
ప్రొడ్యూసర్ శిరీష సిద్ధం మాట్లాడుతూ.. నేనొక సాఫ్ట్వేర్ ఎంప్లాయిని. మా అన్న శ్రీకాంత్ ఈ "ప్రేమదేశం" సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. మేము విడుదల చేసిన టీజర్, టైలర్, సాంగ్స్ కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. వాటిలాగే ఈ మూవీ కూడా సినిమా చాలా బాగా వచ్చింది. ఫ్రెష్ కంటెంట్ తో వస్తున్న ఈ సినిమా చాలా బాగుంటుంది. ఈ మూవీని చూసి బయటకు వచ్చే ప్రతి ఒక్కరూ కచ్చితంగా ఎమోషన్ తో బయటకు వస్తారు. ఫిబ్రవరి 3 న వస్తున్న మా సినిమాను చూసి ఆదరించాలని చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
 ఇంకా హీరో త్రిగున్, నటుడు శివ, అజయ్, హీరోయిన్ మాయ, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, హిట్ 2 డైరెక్టర్ శైలేష్ కొలను, అసోసియేట్ ప్రొడ్యూసర్స్ రఘు కళ్యాణ్ రెడ్డి, రాము  మాట్లాడుతూ సినిమా విజయవంతం కావాలని కోరారు.